భర్తను కాల్చి చంపేసిన భార్య

Date:05/12/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

అంటుకుని సజీవదహనమైన రమేశ్‌ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు అందరూ గుడిసె ప్రమాదవశాత్తూ తగులబడిందని అనుకుంటుండగా పోలీసుల విచారణలో కొత్తకోణం వెల్లడైంది. ముందుగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగిందను అనుమానించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఎవరూ ఊహించని విధంగా విచారణలో కళ్లు చెదిరే నిజాలు వెల్లడి కావడంతో పోలీసులే షాకయ్యారు.ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించిన పోలీసులు ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా మృతుడి భార్య హస్తం కూడా ఉన్నట్లు తెలుసుకుని షాకయ్యారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్‌కేడీ నగర్‌లో రమేష్ భార్య స్వప్నతో కలిసి నివసించేవాడు. ఈ క్రమంలోనే ఆమె వెంకటయ్య అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తను పట్టించుకోకుండా ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగేది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి.ఈ క్రమంలో భర్త తన సుఖానికి అడ్డొస్తున్నాడని భావించిన స్వప్న అతడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. పథకం ప్రకారం నవంబర్ 26న రాత్రి భర్త నిద్రపోతున్న సమయంలో స్వప్న ప్రియుడు వెంకటయ్యతో కలిసి గుడిసెపై పెట్రోల్ పోసి నిప్పింటించింది. దీంతో నిద్రలో ఉన్న రమేశ్‌ సజీవదహనమయ్యాడు. సంఘటనా స్థలంలో స్వప్న రోదించిన తీరుతో స్థానికులందరూ ఆమెపై జాలిపడ్డారు. తొలుత పోలీసులు కూడా ఆమె చెప్పిన ప్రకారమే వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. అయితే సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించిన తర్వాత వారికి అనుమానం వచ్చింది. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టడంతో స్వప్న, వెంకటయ్యల అక్రమ వ్యవహారం బయటపడింది. లైంగిక సుఖం కోసం ఓ నిండు ప్రాణం తీసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

ఉన్నావో బాధితురాలు సజీవ దహనం

 

Tags:Wife who shot her husband

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *