Natyam ad

భార్య హత్య…భర్త ఆత్మహత్యల

పరిగి ముచ్చట్లు:


వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతూ కనబడ్డ కావాలి భీమయ్య నిన్న అర్ధరాత్రి భార్య కావాలి పెంటమ్మ (45)ను గొడ్డలి కామతో తలపై మోది హత్య చేసి భర్త భీమయ్య (48)కూడా ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు తమ్ముడు శ్రీశైలం ఇంటి డోర్ విరగగొట్టి లోపలికి వెళ్లి చూడగా పెంటమ్మ భీమయ్యలు మృతదేహాలు కనబడడంతో పరిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మతిస్థిమితం లేకనే భార్య పెంటమను హత్య చేసి తను భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని బంధువులు తెలుపుతున్నారు. మృతుడు భీమయ్యకు ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు వారికి వివాహాలు జరిగినట్లు మృతుడు భీమయ్య తమ్ముడు శ్రీశైలం తెలిపారు.

 

Tags: Wife’s murder…husband’s suicide

Post Midle
Post Midle