Natyam ad

జగన్ కు అంబేద్కర్ విగ్రహం కలిసొచ్చేనా

విజయవాడ ముచ్చట్లు:


భారత రాజ్యాంగ నిర్మాత డా.BR అంబేద్కర్ భారీ విగ్రహాన్ని విజయవాడ లో ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. 125 అడుగుల ఈ భారీ విగ్రహం దేశం లోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం గా రికార్డుల కెక్కింది. తెలంగాణ లో కూడా 125 అడుగుల ఎత్తున్న విగ్రహం ఉన్నా దాని బేస్ 50 అడుగులు ఉంటే ఏపీ విగ్రహం బేస్ 81 అడుగులు. దేశ ప్రజలందరికీ గౌరవనీయుడైన .అంబేద్కర్ ను దళితులు తమ ఆత్మ గౌరవ ప్రతీకగా చూస్తుంటారు. అయితే అంబేద్కర్ విగ్రహాల ను నిలబెట్టడం ద్వారా దళితుల ఓట్లు గంప గుత్తగా పార్టీలకు పడతాయా అంటే లేదనే గణాంకాలు చెబుతున్నాయి.తెలంగాణ ఏర్పాటు దగ్గర నుండి దళితులు కెసిఆర్ కు ఆయన పార్టీ కు అండగా నిలబడ్డారు దళితులు. దళిత ముఖ్యమంత్రి హామీ ను పక్కన బెట్టేసినా ఆయనకే పట్టం కట్టారు తెలంగాణ దళిత ఓటర్లు. తెలంగాణ లోని 119 అసెంబ్లీ స్థానాలకు గానూ 19  ఎస్సీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో వీటిలో 16 సీట్లను టీఆర్ఎస్  గెలుచుకుంది. అప్పటి విపక్ష కాంగ్రెస్ కేవలం రెండు SC సీట్లకు పరిమితం అయింది. అయితే 2023 ఎన్నికల్లో పరిస్థితి తారుమారు అయింది. ఈ ఎన్నికల్లో BRS గా మారిన టీఆర్ఎస్   5 సీట్లకు పడిపోతే కాంగ్రెస్ ఏకంగా 14 సీట్లకు ఎగబాకింది. తాము 147 కోట్ల తో నిలబెట్టిన అంబేద్కర్ విగ్రహం దళితుల ఓట్లను రాల్చక పోవడం కెసిఆర్ కు పెద్ద షాక్ నే మిగిల్చింది.

 

 

 

అంతే కాదు దళిత బంధు స్కీం..బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ లకు దాదాపు 52 వేల కోట్ల కేటాయించామన్న ప్రచారం దళిత ఓట్లను ఆకర్షించలేక పోయాయి.మరోవైపు చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ తో రిజర్వేషన్స్ పెంపు, ఉద్యోగాల కల్పన హామీల తో కాంగ్రెస్ వారిలో నమ్మకాన్ని కలిగించింది. దళితులు తాము కోరుకునేది అభ్యున్నతి..అధికారం లో వాటా తప్ప విగ్రహాల ద్వారా మెప్పు కోలు పనులు కాదని తమ ఓటు ద్వారా నాయకులకు తెలియ జేశారు.కేసీఆర్ లానే ఇంకా చెప్పాలంటే అంతకంటే పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ లో నిలబెట్టారు ఏపీ సీఎం జగన్. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది అంటూ జరుగుతున్న ప్రచారం  అంతకంతకూ  పెరుగుతున్న సమయంలో దళితుల్ని  అట్టేపెట్టు కోవచ్చు అనేది వైసీపీ వ్యూహం గా విశ్లేషణలు వెలువడుతున్నాయి. నిజానికి వైసీపీ ఆరంభం నుండి దళిత,క్రిస్టియన్ ఓట్లు జగన్ వైపే ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వారు జగన్ ను నెత్తిన పెట్టుకున్నారు.  దానికి తగ్గట్టే తన మంత్రి వర్గంలో దళితులకు పెద్ద పీట వేశారు జగన్. అయితే ఈ నాలుగున్నర ఏళ్ల లో జరిగిన కొన్ని సంఘటనలు వైసీపీ ప్రభుత్వానికి  మచ్చలుగా మారాయి.కోవిడ్ సమయం లో డాక్టర్ సుధాకర్   అంశం, కాకినాడ లో ఎమ్మెల్సీ అనంత్ బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య,  సీతా నగరం శిరో ముండనం కేసు, కడప లో డాక్టర్ అచ్చెన్న మర్డర్ లాంటివి ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టేలా చేశాయి.

 

 

 

Post Midle

ఇక రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత నియోజక వర్గం కొవ్వూరు లో గల పోలీసులు వేధించారంటూ దళిత యువకుడు బొంతా మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ ను రేపింది. సాక్షాత్తూ హోం మంత్రినే ఆ యువకుడి గ్రామం దొమ్మేరు లోకి రాకుండా మూడు గంటల సేపు నిలిపి వేసారంటే ఆ ఘటన ఎంతటి వివాదాన్ని రేపిందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఇండివిడ్యువల్ సంఘటనలు అయితే  ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల లేమి..కార్పొరేషన్ ల నిధులు వాడేసుకున్నారన్న విమర్శలు గుప్పస్తున్నారు విపక్ష నేతలు. అయితే ఇవన్నీ అసత్యాలు అనీ దళితుల పై దాడులు గత ప్రభుత్వ హయాం లోనే అధికం అని అప్పట్లో దేశం లోనే దళితుల పై దాడుల్లో ఏపీ 4వ స్థానం లో ఉండేదనీ.. జగన్ ప్రభుత్వంలో దళిత పథకాల అమలు లో ప్రతీ పైసా లబ్దిదారులకు నేరుగా చేరుతుంది అని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. అయితే గణాంకాల కన్నా కళ్ల ముందు కనపించేవాటినే ప్రజలు ఎక్కువగా నమ్ముతారు.

 

 

 

దళితులకు అధికారం ఇచ్చినా వారికి నిర్ణయాధికారం లేదని హోంమంత్రినే ఉదాహరణగా చూపిస్తున్నారు. దళితులు కీలక పదవులలో  ఉన్నా వారికి కనీసం తమ నియోజకవర్గంపై సమీక్ష చేసే అధికారం కూడా ఇవ్వలేదని అంటున్నారు. కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించాల్సిన నిధులు కూడా ఇవ్వలేదన్న అసంతృప్తి ఉంది.దేశ రాజ్యాంగ నిర్మాత గా ..అంబేద్కర్ ఎప్పుడూ ఆరాధ్యుడే. ఇలాంటి విగ్రహాల ఏర్పాటుకు ఆయన అర్హుడే. అయితే ఈ విగ్రహాల తోనే ఆయన ఆశయం నెరవేరినట్టు కాదు.బడుగు బలహీవర్గాల అభివృద్ధి కీ ..అధికారం లో తమ వంతు భాగస్వామ్యం కోసం పట్టు బడుతున్న దళితుల ఆకాంక్షలను అర్థం చేసుకోకుండా కేవలం విగ్రహాల స్థాపన తోనే వారి ఓట్లు రావు అనేది ఇప్పటికే పొరుగు రాష్ట్రం లో రుజువైంది . మరి దళితుల అభిప్రాయం జగన్ ఇష్యూ లో ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే .

Tags: Will Jagan get Ambedkar’s statue?

Post Midle