ఆపరేషన్‌ చేపట్టే సైనిక కమాండోలు కెమెరాలు పట్టుకెళ్తారా?

Will military cameras take up cameras to carry out the operation?

Will military cameras take up cameras to carry out the operation?

-కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ
Date:26/11/2018
జైపూర్ ముచ్చట్లు:
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని పెంచింది. ఈ సందర్భంగా భిల్వారాలోని ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోందని, కానీ కమాండోలు కెమెరాలు పట్టుకెళ్లరని మోదీ అన్నారు.‘పదేళ్ల క్రితం ఈ రోజున ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. లష్కరే ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి ముంబయిలో మారణహోమం సృష్టించారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేడు దేశభక్తి గురించి ప్రసంగాలిస్తోంది. అంతేగాక.. దేశం గర్వించేలా మేం సర్జికల్‌ దాడులు చేపడితే వాటిని ప్రశ్నిస్తోంది. రుజువులు కావాలని అడుగుతోంది. కానీ ఆపరేషన్‌ చేపట్టే సైనిక కమాండోలు ఆధారాల కోసం కెమెరాలు పట్టుకెళ్తారా?’ అని ఆ పార్టీని మోదీ దుయ్యబట్టారు.కాంగ్రెస్‌ పార్టీ నక్సలైట్లను విప్లవకారులని చెబుతోందని, వారికి ధ్రువపత్రాలు కూడా ఇచ్చిందని ప్రధాని ఆరోపించారు. అయితే అమాయక ప్రజలకు హాని చేస్తున్న ఉగ్రవాదులు, నక్సలైట్లకు తమ ప్రభుత్వం వారి భాషలోనే బదులిస్తోందన్నారు. 26/11 ముంబయి దాడిని భారత్‌ ఎప్పటికీ మర్చిపోలేదని, ఆ దాడికి పాల్పడిన సూత్రధారులను వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ అన్నారు. బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. డిసెంబరు 7న ఎన్నికలు నిర్వహించనున్నారు. 11న ఫలితాలు వెలువడుతాయి.
Tags:Will military cameras take up cameras to carry out the operation?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *