పవన్ కళ్యాణ్ ప్లేస్ ఛేంజ్ అవుతారా

విజయవాడ  ముచ్చట్లు:
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌  నెక్స్ట్ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? అంటే ఇంకా ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదనే చెప్పొచ్చు. ప్రశ్నించడం కోసమని చెప్పి జనసేన పెట్టిన పవన్..2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీలకు మద్ధతు ఇచ్చి, వారు అధికారంలోకి రావడానికి కృషి చేశారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీలతో పొత్తు వద్దు అని చెప్పి, కమ్యూనిస్టులు, బి‌ఎస్‌పిలతో పొత్తు పెట్టుకుని తొలిసారి ఎన్నికల బరిలో దిగారు.పవన్ సైతం గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీకి దిగారు. ఈ రెండుచోట్ల కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో, పవన్ పోటీ చేశారు. కానీ ఊహించని విధంగా పవన్ రెండుచోట్ల ఓడిపోయారు. అటు జనసేనకు సైతం ఒక సీటు వచ్చింది. రాజోలులు జనసేన గెలిచింది. అలా గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీలో పనిచేస్తున్నారు. అయితే ఇంత ఓటమి వచ్చాక పవన్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు ఏమి చేయడం లేదు. ఈ రెండేళ్లలో జనసేనని పవన్ నిలబెట్టే ప్రయత్నాలు చేయలేదు. పైగా బీజేపీతో పొత్తు పెట్టుకుని సేఫ్‌గా రాజకీయం చేస్తున్నారు.అయితే నెక్స్ట్ పవన్ పోటీ చేసే సీటు విషయంలో క్లారిటీ రావడంలేదు. పవన్ కల్యాణ్ కంటూ ఒక నియోజకవర్గం పర్మినెంట్‌గా లేదు. చంద్రబాబుకు కుప్పం, జగన్‌కు పులివెందుల ఉన్నాయి. కానీ పవన్ సీటు విషయంలో క్లారిటీ లేదు. పవన్ మళ్ళీ గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేస్తారా? లేక వేరే సీటులోకి వెళ్తారా? అనే విషయం తెలియడం లేదు.ఇప్పుడున్న పోటీలో త్వరగా సీటు ఫిక్స్ చేసుకుంటే, వచ్చే ఎన్నికలనాటికి అక్కడ జనసేనని బలోపేతం చేసుకోవచ్చు. కానీ పవన్ మాత్రం ఎందులోనూ క్లారిటీ ఇవ్వడం లేదు. మళ్ళీ గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీకి దిగితే, ఇప్పటినుంచే ఆ రెండుచోట్ల పవన్ యాక్టివ్‌గా పనిచేయాలి. తాను డైరక్ట్‌గా కాకపోయిన, పార్టీలో బలమైన నేతలనీ అక్కడ పెట్టి పనిచేయించాలి. లేదా వేరే సీటులో బరిలో దిగాలని అనుకుంటే, అక్కడ పార్టీని లైన్ చేయాలి. కానీ ఇవేమీ పవన్ చేయడం లేదు. అంటే వచ్చే ఎన్నికల వరకు పవన్ సీటు విషయంలో క్లారిటీ వచ్చేలా లేదు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Will Pawan Kalyan change place?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *