Natyam ad

తంబళ్లపల్లె ఉత్కంఠ వీడేనా?

-టికెట్ పై మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గాల ధీమా
-ఇప్పటికే జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వ ప్రకటన
-నేడు చంద్రబాబును కలవనున్న శంకర్

 

తంబళ్లపల్లె ముచ్చట్లు:


తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకప్పుడు టిడిపి టికెట్ విషయంలో రెండో ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రాజకీయాలు మారిపోయాయి. రాత్రికి రాత్రి కొత్త నాయకులు వస్తున్నారు. ఉన్న నాయకులు ఎప్పుడు ఉంటారు..ఎప్పుడు ఊడిపోతారో తెలియని పరిస్థితి. అక్షరాలా ఇదే పరిస్థితి తంబళ్లపల్లె టిడిపికి వర్తిస్తుంది.

Post Midle

చంద్రబాబు ప్రకటనతో గందరగోళం

2014 నుంచి టీడీపీలో ఉన్న శంకర్ కు చంద్రబాబు నాయుడు చుక్కలు చూపిస్తున్నారు. టికెట్ తనకే అన్న ధీమాతో ఉన్న ఆయనకు జయచంద్ర రెడ్డి రూపంలో చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. గత శనివారం చంద్రబాబు పార్టీ అభ్యర్థుల ఎంపికలో భాగంగా తంబళ్లపల్లెలో జయచంద్ర రెడ్డికి కేటాయించారు. ఆయన రెండు నెలల క్రితమే టిడిపిలోకి చేరిన కొత్త వ్యక్తి. అయితే ఏం జరిగిందో ఏమో కానీ టికెట్ దక్కించుకున్నారు. ఇది శంకర్ వర్గానికి నచ్చలేదు. బి కొత్తకోట లోని ఆయన పార్టీ కార్యాలయం పై ఉన్న జెండాలు, బ్యానర్లు తొలగించారు. అంతటితో ఆగక పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు ప్రకటించారు. టికెట్ విహారపై నిరసన వ్యక్తం చేస్తూ శంకర వర్గీయులు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేశారు. వారికి త్రీ మెన్ కమిటీ సభ్యులు, చంద్రబాబు నచ్చజెప్పి పంపారు.

ఆ రాత్రి ఏం జరిగింది

మంగళవారం రాత్రి శంకర్ తన కుమారుడు శ్రీకాంత్ తో కలిసి చంద్రబాబుతో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఉండవల్లి లోనే చంద్రబాబు ఇంటిలో జరిగిన ఈ భేటీ అనంతరం శంకర్ వర్గీయులు టికెట్ పై ధీమా వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో పార్టీ అధిష్టానం నుంచి సానుకూల ప్రకటన వెలువడుతుందని ప్రచారం చేసుకున్నారు. ఆనందం తట్టుకోలేక అదే రోజు రాత్రి ఆయన అభిమానులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబుకు శంకర్ ఏమి చెప్పారు, ఏ విషయాలను నివేదించారు అన్నది ఇప్పటికీ సస్పెన్సనే. చంద్రబాబు నుంచి సానుకూల ప్రకటన వస్తుందా లేదా అన్నది అటుంచితే టికెట్ విషయంలో శంకర్ పట్టుదలకు పోతారని అర్థమవుతుంది. ఐదేళ్లు కష్టపడిన తనను కాదని పార్టీ జెండా మోయని వాళ్ళు టికెట్ ఇస్తే గెలిపించాలా అన్నది శంకర్ వర్గాల వాదన.

 

ఈ పరిస్థితుల్లో శంకర్ శుక్రవారం చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. ఈ భేటీలో అటు ఇటు తేలిపోతుంది. అయితే టికెట్ కోసం శంకర్ తీవ్రంగా పట్టుబడుతున్నారు.తమకు టికెట్ దక్కని పక్షంలో చివరి అస్త్రం ఉండనే ఉందని శంకర్ వర్గం చెబుతోంది. తమ సహకారం, మద్దతు లేకుండా ఏ అభ్యర్థికయిన గెలుపు సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.

 

 

కొత్త అభ్యర్థికి అంత ఈజీ కాదు

తంబళ్లపల్లిలో టిడిపి గెలవాలంటే టికెట్ తీసుకొచ్చినంత ఈజీ కాదు. రాజకీయాలకు కొత్త, వర్గాలు, వ్యవహారాలు, వాటితో మచ్చిక చేసుకోవడం.. ఇలా ఎన్నో వ్యవహారాలు చక్కదిద్దుకోవాలి. వారిని నమ్మి ఎన్నికల్లో ముందుకు పోవాలి. లేకపోతే అసలుకే మోసం వస్తుంది. ఈ పరిస్థితుల్లో రెండు నెలల క్రితం పార్టీలో చేరిన జయచంద్ర రెడ్డి టిడిపి టికెట్ దక్కించుకున్నారు. ఇప్పుడు పార్టీలో కొత్త వ్యక్తి జయచంద్ర రెడ్డినే. కార్యకర్తలను ఆయన అక్కున చేర్చుకోవడం కాదు.. ఆయనను కార్యకర్తలు ఆదరించాలి.. నాయకులు నమ్మాలి. సమిష్టిగా కలిసి పోరాడాలి. 40 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో రెడ్డికి ఇది సాధ్యమా. కొత్తగా చేరిన నేతతో పార్టీ క్యాడర్ కు సఖ్యత అంత త్వరగా సాధ్యమవుతుందా. ఇలాంటి ఎన్నో చిక్కు ప్రశ్నలు ఉన్నాయి. అన్నింటికీ కాదు ఒకరిని ఒక రెండు కూడా సమాధానం లేకపోవచ్చు. అలాంటప్పుడు శంకర రూపంలో వ్యతిరేకత కూడా పొంచి ఉంది. అన్ని దాటుకుని టికెట్ తెచ్చుకున్నంత సులువుగా జయచంద్ర రెడ్డి విజయం సాధిస్తారా?. గెలవనిస్తారా??.

 

Tags:Will Tamballapalle get excited?

Post Midle