చెత్తకు పన్నులు వేస్తారా…. తీవ్రస్థాయిలో మండిపడ్డ పీసీసీ చీఫ్ శైలజానాథ్

విశాఖపట్నం  ముచ్చట్లు :
‘చెత్తకు పన్నులు వేస్తారా….చెత్త మంత్రులు. పన్నులు పెంచుతోంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు నోటికి ప్లాస్టర్లు వేసుకుని ఉన్నారా?’’ అని పీసీసీ చీఫ్ శైలజానాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పన్నుల పెంపు విధానంపై ఈనెలన 18న ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తామన్నారు. సర్పంచులకు అధికారాలు లేకుండా చేయడం గ్రామ స్వరాజ్యమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను ఎవరికి తాకట్టు పెడదామనుకుంటున్నారని నిలదీశారు. భూములను అమ్ముకోవడం దిగజారుడు తనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రపై వైసీపీ ఇన్‌చార్జ్‌లు  పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాము పోరాడుతున్నామని… పార్లమెంటును స్థంభింపజేస్తే కేంద్రం దిగిరాదా? అని ప్రశ్నించారు. అశాస్త్రీయ పద్ధతిలో వ్యాక్సినేషన్లు వేస్తున్నారని శైలజానాథ్ అన్నారు.

 

భర్తను కొట్టి చంపిన భార్య

 

Tags:Will taxes be levied on garbage …. PCC chief Shailajanath incensed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *