బెజవాడకు టీడీపీని ధూళిపాళ సెట్ చేస్తారా…
విజయవాడ ముచ్చట్లు:
చాలా కాలం సైలెంట్‌గా ఉన్న కేశినేని.. సింపుల్‌గా మూడు రోజుల పాటు చేసిన రాజకీయం, కామెంట్లు పార్టీలో విపరీతమైన చర్చకు దారితీశాయనే చెప్పాలి. పైగా ఇది ఇక్కడితో ఆగదు అనే సంకేతాలు కూడా కేశినేని నాని ఇచ్చారు. దీంతో కేశినేని బాంబ్ మళ్లీ ఎప్పుడు పేలుతుందో తెలియడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీ అధినాయకత్వం సహా.. అందరూ క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలు రూపొందించుకుంటున్న ఈ సమయాన్ని టీడీపీ అధిష్టానం చాలా ఇంపార్టెంట్ టైమ్‌గా భావిస్తోంది. ఈ క్రమంలో కేశినేని టపాస్ బ్లాస్ట్ అయితే ఇబ్బందులు తప్పవనే చర్చ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.బెజవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్‌ను వీలైనంత త్వరగా సెట్ చేసుకుంటే బెటరని భావిస్తున్నారట టీడీపీ పెద్దలు. అలా కాకుండా.. కేశినేని నాని కామెంట్లను చూసీచూడనట్టుగా వదిలేస్తే.. పరిణామాలు వేరే విధంగా ఉండే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యర్థి పార్టీలో అసంతృప్త గళం వినిపించిన మరుక్షణం… దాన్ని సర్దుబాటు చేసుకోవడమో, అది కుదరకుంటే చర్యలు తీసుకోవడమో జరుగుతుంది. కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే తాము మాత్రం చతికిలిపడిపోతున్నామని స్వపక్ష సీనియర్లు అంటున్నారు. కనీసం డామేజ్ కంట్రోల్ మెకానిజం అనేది కూడా లేకుండా వదిలేస్తే కష్టమనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో ఫ్యాన్ గిర్రున తిరిగిన సందర్భంలోనూ నాని గెలిచారంటే… కచ్చితంగా నానిని గౌరవించుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని అంటున్నారు కొందరు సీనియర్లు. ఈ క్రమంలో నానితో సంప్రదింపులు జరిపితే బెటరనే భావన వారిలో వ్యక్తమవుతోంది. పార్టీలో కేశినేని నానితో ఎవరు సన్నిహితంగా ఉంటారో గమనించి..
వారికి సంప్రదింపులు బాధ్యత అప్పగిస్తే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారట. ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పర్యవేక్షణ.. పరిశీలన బాధ్యతలను పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర చూస్తున్నారు. కేశినేని నానికి, ధూళిపాళ్లకు మధ్య సన్నిహిత సంబంధమే ఉంది. నాని దూకుడుకు బ్రేకులు పడాలంటే ధూళిపాళ్లే కరెక్ట్ అనే అభిప్రాయం ఉంది. కానీ ధూళిపాళ్ల మాత్రం ఈ వ్యవహారాన్ని సెట్ చేసేందుకు ఎందుకు ముందుకు రావడం లేదనే చర్చ జరుగుతోంది. నాని అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు లేక ధూళిపాళ్ల నరేంద్ర ముందుకు రావడం లేదా? లేక అధిష్టానం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదా? అని చర్చించుకుంటున్నారు.పార్టీ హైకమాండ్ నాని కామెంట్లపై సీరియస్‌గానే ఉన్నట్టు సమాచారం. అయితే నాని కామెంట్లకు స్పందించి.. రియాక్ట్ అయితే మరింత చర్చకు, రచ్చకు దారి తీసినట్టువుతందనే భావనతో ప్రస్తుతానికి నేతలను సైలెంట్‌గా ఉండమని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు నాని బహిరంగ కామెంట్లు చేశారు కానీ.. పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల వద్ద కూడా పార్టీ పెద్దలను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు హైకమాండ్ దృష్టికి వెళ్లాయట.

దీంతో నాని విషయంలో పార్టీలోని సదరు పెద్దలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోందిఇటీవల పార్టీ అధిష్టానం వద్ద జరిగిన ఓ సమావేశంలో నాని ప్రస్తావన వచ్చిందట. పార్టీని, నేతలను, అధిష్టానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా నాని కామెంట్లు చేస్తున్నారనే భావన వ్యక్తమైనట్టు తెలుస్తోంది. పార్టీలో పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న వారు.. వాటిని ఎందుకు సర్దుబాటు చేయడం లేదని చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నానిని సెట్ చేసే బాధ్యతను ధూళిపాళ్లకు అప్పజెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి వీలైనంత వరకు నాని ఎపిసోడ్‌ను సెట్ చేయాలని, లేకుంటే ఆయనపై చర్యలు తీసుకోవాలనే తరహాలోనే చర్చ జరుగుతోంది. నానిని నేరుగా పార్టీ అధినాయకత్వమే పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందనే భావన వ్యక్తమవుతోంది. మరి నాని యాక్షన్‌కు అధిష్టానం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Tags:Will TDP set a dustbin for Bejwada?
