బల్లిని  బలి తీసుకుంటురా… సోషల్ మీడియాలో సెటైర్లు

Date:21/11/2020

విజయవాడ ‌ ముచ్చట్లు:

తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పీర్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ప్రజాప్రతినిధులు చనిపోతే ఆ స్థానానికి అదే కుటుంబానికి చెందిన వ్యక్తిని నిలబట్టి ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేవారు. అయితే ఈ సంప్రదాయం మెల్లిగా తెరమరుగవుతోంది. ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు సాక్ష్యం. గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చనిపోగా, ఆయన కుటుంబ సభ్యుడు పోటీకి దిగితే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని నిలబెట్టారు. ఇటీవలే తెలంగాణలోని దుబ్బాక స్థానంలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణించగా, అక్కడ సైతం ఉప ఎన్నిక జరగ్గా.. అనూహ్యంగా సిట్టింగ్ పార్టీని కాదని బీజేపీ విజయం సాధించింది.ఈ తరుణంలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించగా, ఆ స్థానానికి ప్రతిపక్ష పార్టీలు ఉప ఎన్నికకు సిద్ధమైపోయాయి. అధికార వైసీపీ సైతం గత సంప్రదాయాలకు మంగళం పాడి.. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుడికి కాకుండా తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయన సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఆయన వెంటే ఉన్నారు. దీంతో బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే సీఎం జగన్ ఇచ్చిన ఈ హామీ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది.కొన్ని నెలల ముందుగానే మూడు రాజధానుల బిల్లులను శాసనమండలిలో అడ్డుకోవడంతో ఏకంగా మండలిని రద్దు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో మండలి రద్దుపై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈ సమయంలో మండలి వల్ల డబ్బు, సమయం వేస్ట్ అంటూ వైసీపీ నాయకులు సీఎం జగన్‌కు మద్దతుగా నిలిచారు. అయితే మండలి ఎప్పుడు రద్దు అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తిని శాసనమండలికి పంపిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఎప్పుడు ఉంటుందో, ఊడుతుందో తెలియని మండలికి పంపుతానని హామీ ఇచ్చి బల్లి దుర్గా ప్రసాద్ ఫ్యామిలీని రాజకీయంగా అన్యాయం చేశారని ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నారు. ఈ మేరకు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సైతం సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అలాగే టీడీపీ కార్యకర్తలు సైతం సీఎం జగన్‌ను ఈ విషయంలో ట్రోల్ చేస్తున్నారు.

 

రమేష్…రాజీనామా ఆమోదం

Tags:Will the lizard be sacrificed … satires on social media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *