తెలంగాణలో కమలం వికసించేనా?

Will the lotus bloom in Telangana?

Will the lotus bloom in Telangana?

Date:26/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
“తెలంగాణలో మాకు 75 సీట్లు వస్తాయి. ఇక్కడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీయే” – కమలం నేత పరిపూర్ణనంద స్వామి అంటే,”తెలంగాణ రాష్ట్ర సమితి పాలనతో ఇక్కడి ప్రజలు విసిగిపోయారు వారు పట్టం కట్టేది మాకే – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్పేర్కొన్నారు.కాగా”కేంద్రంలో మేము అమలు చేసిన పథకాలే మాకు విజయాన్ని అందిస్తాయి – కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొనడం జరిగింది.ఇదీ తెలంగాణ ముందస్తు ఎన్నికలలో నెల రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ నాయకుల వ్యాఖ్యలు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఆ పార్టీకి విజయం దక్కే అవకాశాలు కనిపించటం లేదు. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఏక సంఖ్యలోనే విజయం దక్కుతుందని అంటున్నారు. ముందస్తు ఎన్నికలలో పోటీ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి – మహాకూటమి అభ్యర్థుల మధ్య ఉంటుందని చెబుతున్నారు.
తెలంగాణలో జంట నగరాలతో పాటు వరంగల్ – నిజామాబాద్ – రంగారెడ్డి జిల్లాలలో భారతీయ జనతా పార్టీకి కొంత పట్టు ఉంది. అయితే పార్టీ అగ్ర నాయకుల మధ్య విబేధాలు తారస్థాయికి చేరడంతో తెలంగాణలో పార్టీ పట్టు కోల్పోతోందంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గెలుపుపై కమలనాథులకు ఆశలు పోయాయంటున్నారు.ఆంధ్రకు చెందిన శ్రీపీఠం వ్యవస్దాపకుడు పరిపూర్ణానంద స్వామి పార్టీలో చేరినప్పటి నుంచి అంతర్గత లుకలుకలు ప్రారంభమయ్యాయట. తెలంగాణలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు ప్రాధాన్యం తగ్గడం – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వర్గీయులను పక్కన పెట్టడంతో విబేధాలు మరింత పెరిగాయట. వీటి కారణంగానే తెలంగాణలో ఉన్న కొద్దిపాటి ఆశలు అడుగంటాయని అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాజధాని ఆయువు పట్టు.
గతంలో ఉప్పల్ – అంబర్ పేట – ముషీరాబాద్ – జూబ్లీహిల్స్ – గోషామహల్ లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఆ ఎన్నికలలో కమలానికి తోడుగా తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే ఇప్పుడు తెలుగుదేశంతో  స్నేహం మాట దేవుడెరుగు శత్రుత్వమే ఉంది. దీని ప్రభావం కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు పై చూపుతుందంటున్నారు. మరోవైపు నగరంలోని అంబర్ పేట – గోషామహల్ కు చెందిన పార్టీ సీనియర్ నాయకులు రాత్రికి రాత్రి కారెక్కేసారు. ఇలా కమలాన్ని వీడిన నాయకులకు ఆయా నియోజకవర్గాలలో మంచి పట్టుంది. దీంతో కమలానికి ఆయువుపట్టైన రాజధాని కమలానికి దూరమయినట్టే. తెలంగాణ జిల్లాలలో కూడా పార్టీ పరిస్దితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ పరిణామాలతో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు.
Tags:Will the lotus bloom in Telangana?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *