Natyam ad

కొత్త కార్యాలయంలోనైనా ఆర్టిఏ అధికారుల పనితీరు మారేనా?

వరంగల్ ముచ్చట్లు:

కొత్త కార్యాలయంలోనైనా ఆర్టిఏ అధికారుల పనితీరు మారి ప్రజల మెప్పును పొందాలని ప్రజలు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా హనుమకొండ ఆర్టిఏ  కార్యాలయం  వరంగల్ జిల్లాలోని నాయుడు పంపు సమీపంలో ఉండి హనంకొండ ప్రజలకు సేవలను అందించేది. శుక్రవారం అక్కడినుండి  హనుమకొండ ఆర్టిఏ కార్యాలయం హనంకొండ సమీపంలోని చింతగట్టు క్యాంపు ఆవరణలోకి వచ్చింది. దీంతో హనుమకొండ జిల్లాలోని 14 మండలాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందించే అవకాశం ఏర్పడిందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో వలె కాకుండా అధికారులు వాహనదారులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా భిన్నంగా పనిచేసే వాహనదారుల, ప్రజల మన్ననలను పొందే విధంగా తమ సేవలు ఉండాలని ప్రజలు అనుకుంటున్నారు. ఆర్టిఏ కార్యాలయంలో బ్రోకర్ల  బెడదను తగ్గించి వాహనదారులకు నాణ్యమైన సత్వరమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టిఏ ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు. హనుమకొండ కాజీపేట మండలాలతో పాటు జిల్లాలోని మరో 12 మండలాల ప్రజలకు ఆర్టిఏ అధికారులు సేవలను అందించే పరిస్థితి రావడం పట్ల అనుమకొండ జిల్లా ప్రజల కష్టాన్ని తగ్గించి ప్రయాణభారంతో పాటు ఆర్థిక భారాన్ని తగ్గించినట్టైందని ప్రజలు అనుకుంటున్నారు. ఆర్టిఏ కార్యాలయానికి వచ్చే వాహనదారులకు తొందరగా సేవలను అందించడంతో పాటుగా రోడ్డు రవాణా రంగంలో వాహనదారులకు ఉన్న ఇబ్బందులను పూర్తిగా తెలియపరచి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే సమయాలలో వాహనదారులకు రోడ్డు నిబంధనలు తెలిసే విధంగా చర్యలు ఉండాలని అంటున్నారు.కొత్తగా వాహనాలు తీసుకొని రోడ్డుమీద ప్రయాణం చేసే వాహనదారులకు రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటుచేసిన సిగ్నల్స్ తెలిసే విధంగా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని అలాంటప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ప్రజలు అంటున్నారు.

 

 

 

Post Midle

అవేవీ లేకుండా దళారుల తో వాహనాల రిజిస్ట్రేషన్లు చేయించి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి నేరుగా వారిని రోడ్డుమీద వాహనాలను నడిపించినట్లయితే ఎన్నో ప్రమాదాలకు వారు కారణమవుతున్నారని అలాంటి చర్యలకు అధికారులు స్వస్తి పలకాలని ప్రజలు అంటున్నారు. ఆర్టిఏ కార్యాలయంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి నూతన వాహన దారులకు అన్ని పరీక్షలు చేసి వారికి రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఇప్పించే విధానానికి అధికారులు రకాల చర్యలు తీసుకొని ఇవ్వాలని జిల్లా ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఇప్పటివరకు చేసిన రిజిస్ట్రేషన్లకు భిన్నంగా నూతన విధానంలో రిజిస్ట్రేషన్లు చేసి లైసెన్సులు ఇప్పించి వాహనాలకు, ప్రజలకు భద్రత ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు. రోడ్డుపై అనుమతి లేకుండా నడిచే వాహనాలపై చర్యలు తీసుకొని వారిని వెంటనే అనుమతులు తీసుకునే విధంగా ఆర్టిఏ అధికారులు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి వారిలో అవగాహన కల్పించాలని అంటున్నారు. వాహనాలకు ఫిట్నెస్ వాహన బీమా లాంటివి లేకుండా రోడ్డుపై వాహనాలు తిరిగితే ఇతరులకు ప్రమాదాలు జరిగినప్పుడు వారి కుటుంబాలు బజారున పడే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. ఒక్కో వాహనానికి ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్ చేసే సమయాలలో వేలకు వేలు దళారులతో వసూలు చేయించి దండుకునే విధానానికి స్వస్తి కలకాలని ప్రజల కోరుతున్నారు. నెలకు వేలకు వేలు జీతాలు తీసుకునే ఆర్టిఏ ఉద్యోగులు అక్రమ వసూళ్లకు దిగడం క్షమించరాని నేరమని ప్రజలు అంటున్నారు.కొత్త కార్యాలయంలోనైనా తమ పనితీరును మార్చుకొని ప్రజల మెప్పును పొందాలని ప్రజలు అంటున్నారు.

 

Tags: Will the performance of RTA officers change in the new office?

Post Midle

Leave A Reply

Your email address will not be published.