ఆళ్లగడ్డలోపాతుకుపోయిన అధికారులకు బదిలీలు జరిగేనా???

ఆళ్లగడ్డ ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తి అయిన ప్రతి ఒక్క అధికారికి బదిలీ తప్పదని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అంతేకాకుండా ఐదేళ్లు పూర్తి కాకుండా కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా పరిస్థితిని బట్టి బదిలీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బదిలీ జీవో రావడం కొంతమంది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని మిగిలిన కొందరు ఉద్యోగులకు ఈ జీవో వర్తించేలా లేదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు.. అధికార మరియు రాజకీయ పలుకుబడులతో కొందరు  వారు పనిచేస్తున్న సీట్లు వదలడం  లేదు. ఏళ్ల తరబడి అక్కడే పని చేయడం వల్ల పరిచయాలుఏర్పడి తిరిగి విధులకు రాకుండా మనల్ని ఎవరు ఏమంటారు లే అనే విధంగా విధులు నిర్వహిస్తున్నారు. కొందరు ఉద్యోగులు ఐదు సంవత్సరాలు పూర్తయిన ఆళ్లగడ్డ లో సీటు కదలకుండా పని చేస్తున్న ఉద్యోగుల పై ప్రత్యేక కథనం ప్రధానంగాఆళ్లగడ్డ మండలంలో రెవిన్యూ మరియు మండల ప్రజా పరిషత్ వంటి వివిధ శాఖలు ఉన్నాయి ఈ రెవెన్యూ శాఖ విభాగంలో పనిచేస్తున్న వి ఆర్ వో లు మరియు సర్వేయర్ ఆ మండల కార్యాలయంలో 5 సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాలు గా పనిచేస్తున్న బదిలీలు కావడం లేదు అంతేకాకుండా బదిలీ పేరుతో కేవలం గ్రామాన్ని మాత్రమే మార్చుకుంటున్నారు. కానీ ఆ మండలం నుండి బదిలీ జరగడం లేదు దీనివల్ల ఏ గ్రామానికి ఉన్న వీఆర్వో ఆ గ్రామంలోనే సమస్యలు తీర్చాలి ఉండగా గతంలో పని చేసి వేరే గ్రామంలో ఉన్న సమస్యలు తీర్చడమే కాకుండా అక్రమాలకు  పాల్పడుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.

 

 

 

ఇక మండల సర్వేయర్ ఐదు నుండి ఏడు సంవత్సరాలుగా పైగా పనిచేస్తున్న బదిలీలు కావడం లేదని వీరికి ప్రభుత్వ జీవోలు వర్తించవా అని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. ఓకే మండలంలో ఏళ్ల తరబడి పని చేస్తూ విధులకు కూడా హాజరు కావడం లేదని విమర్శలు ఉన్నాయి .కానీ ఏ అధికారి పట్టించుకోవడం లేదని పలువురు చెబుతున్నారు. కొందరు సొంత నియోజకవర్గంలోనే ఏళ్ల తరబడి పనిచేస్తున్న దీనివల్ల వీధుల్లోకి రాకుండా   రైతులు వారిపై ఉన్న అభిమానంతో ఫిర్యాదులు కూడా చేయలేకపోతున్నారు. ఇక మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని విషయానికొస్తే పంచాయతీ సెక్రటరీలు గ్రామంలో వారు చెప్పిందే వేదం గా ఉంటుంది పంచాయతీ కార్యదర్శులు వీఆర్వోల మాదిరిగానే మండలాలు మారకుండా గ్రామాలు మాత్రమే మారి పెత్త నాలు చెలాయిస్తున్న ఆయా మండల కార్యాలయంలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది కూడా పక్క మండలానికి కూడా బదిలీపై వెళ్లకుండా బదిలీ వచ్చిన నిలిపి వేసుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఐదు నుండి ఏడు సంవత్సరాలు పూర్తయిన వారు కూడా బదిలీపై వెళ్ళకుండా అక్కడే ఉన్న అధికారులను బదిలీ చేయాలని కోరుతున్నారు .

 

Post Midle

Tags: Will there be transfers to the officers who are rooted in the cane ???

Post Midle
Natyam ad