మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుకి కృషి చేస్తా    

తూర్పు శాసన సభ్యులు నన్నపునేని నరేందర్

వరంగల్ ముచ్చట్లు:

తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ &అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్స్ &వర్కర్స్ యూనియన్  ప్రతినిధులు వరంగల్ తూర్పు శాసనసభ్యులు  నన్నపునేని నరేందర్ ను  కలిసి వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు రూ,21,000/- లకు వేతనం పెంచాలనే  విషయం గురించి మంత్రి కేటీఆర్  దృష్టికి తీసుకెల్తానని, కార్మికులకు అండగా ఉంటానని అన్నారు.  తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కెసిఆర్, మున్సిపల్ కార్మికులను గుర్తించి”సఫాయి అన్న నీకు సలామన్న” అని రెండుసార్లు వేతనాలు పెంచి కార్మికులశ్రమను గుర్తించారు. ముఖ్యంగా కరోనా కాలంలో మున్సిపల్ కార్మికులు వారియర్స్ లాగా ప్రాణాలను సైతం లేక్కచేయకుండా ప్రజలకు సేవలు చేసినప్పుడు కూడా ప్రోత్సాహకాలు అందించారు. యూనియన్ నాయకులు సూచించిన ప్రకారం పేరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరకు అనుగుణంగా, కార్మికుల కుటుంబాలను ఆదుకునేవిదంగా పక్క రాష్ట్రం ఆంద్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులకు పెంచినట్లు మన దగ్గర కూడా అమలు చేయాలని కోరారు.  రాష్ట్రంలో మన కార్మికుల సేవను గుర్తించి ముఖ్యమంత్రి కేసిఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను ఒప్పించి ప్రభుత్వం చే రూ, 21000/- వేతనం అమలు చేయించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని యూనియన్ నాయకులు తెలియజేశారు.

 

Tags: Will work to increase the wages of municipal workers

Leave A Reply

Your email address will not be published.