జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
మెట్ పల్లి ముచ్చట్లు:

జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే (ఐజేయు) కార్యవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను కలసి జర్నలిస్ట్ లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు, దళిత జర్నలిస్టులకు దళిత బంధు, పట్టణంలో ప్రెస్ భవన్ ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లకు జర్నలిస్ట్ బంధు పథకాన్ని ప్రవేశపెట్టేలా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.
అర్హులైన విలేకరులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు కు కృషి చేస్తానన, దళిత బంధు పథకాన్ని జర్నలిస్ట్ లకు వర్తింప చేసే విధానం పై ముఖ్యమంత్రి తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని. జర్నలిస్ట్ లకు తన వంతు సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా అధ్యక్షుడు ఆగ సురేష్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శులు భూరం సంజీవ్, మ్యాకల శివ, ఉపాధ్యక్షులు మహ్మద్ అజీమ్, మాసుల ప్రవీణ్, కోశాధికారి అలలా రాజేష్, సంయుక్త కార్యదర్శులు జంగం విజయ్, తరి రాజశేఖర్,ఆర్గనైజింగ్ కార్యదర్శి ఓంకారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఎస్.కె ఎస్.కె సాజీద్, సోయల్ హుస్సేన్,ఎండి అజీముద్దీన్,మాధస్తూ రాజేష్, సభ్యులు జొరిగే శ్రీనివాస్, ఫిరోజ్ ఖాన్, దికొండ మురళి, కలిం, మసూద్, మహేందర్,లు పాల్గొన్నారు.
Tags;Will work to solve the problems of journalists
