వడగాల్పుల హెచ్చరిక

Date:21/05/2019

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్రంలో వడగాల్పులు మళ్లీ పెరగనున్నాయి. ఈ నెల 25 నుండి 29 వరకు వడగాల్పులు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని  రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) హెచ్చరించింది. కృష్ణా, నెల్లూరు, కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతల్లోనూ అధిక ప్రభావం ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలు, కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు స్థాయిలో వడగాల్పుల వీచే సూచనలున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 45 నుండి 48 డిగ్రీల మధ్యలో నమోదయ్యే సూచనలున్నాయని ప్రకటించింది. వడగాల్పుల నుంచి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 23 నుండి 27 వరకు రాయలసీమకు వర్ష సూచనరాయలసీమలోని పలు ప్రాంతాల్లో ముందస్తు రుతుపవన వర్షాలు కురిసే సూచనలున్నాయి. అనంతపురం, చిత్తూరు జిల్లాలోని కొన్ని మండల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆర్టీజీఎస్ ప్రకటించింది.

 

చంద్రబాబు కు సిగ్గు రావడం లేదు

 

Tags: Wilt Warning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *