కాంగ్రెస్ ను గెలిపించండి

Win Congress

Win Congress

Date:22/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ముషిరాబాద్ మహా కూటమి అభ్యర్థి మందడి అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కోరారు. బుధవారం ముషీరాబాద్ డివిజన్ లో ఆయన అనిల్ కుమార్ యాదవ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా కుమార్ యాదవ్ ప్రజలను కలిసి వచ్చే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చిరు వ్యాపారులను కలిసి కర పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో  అధికారంలో వచ్చేది మాహాకూటమి  ఆయన ధీమా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని,  అందుకే ప్రజలందరూ ఈరోజు కూటం వైపే ఉన్నారన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేశ్వర్, నక్క క్రిష్ణా గౌడ్, వంగల నర్సింగ్ రావు, శత్రు తదితరులు పాల్గొన్నారు.
Tags:Win Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *