Win Lok Adalat nationally

జాతీయమెగా లోక్‌అదాలత్‌ను జయప్రదం చేయండి

– న్యాయమూర్తి బాబునాయక్‌ పిలుపు

Date:25/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

జాతీయ మెగాలోక్‌అదాలత్‌లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌ పిలుపునిచ్చారు. శనివారం ఆయన పుంగనూరులో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సీవిల్‌జడ్జి భారతి , న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు పులిరామకృష్ణారెడ్డి , సీఐలు గంగిరెడ్డి, మదుసూదనరెడ్డి తో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబునాయక్‌ ఫిబ్రవరి 8న జాతీయ మెగాలోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌లో అన్ని రకాల కేసులను రాజీచేసి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్నిశాఖల అధికారులు తమ పరిధిలోని కేసులను పరిష్కరించేందుకు కక్షిదారులకు చైతన్యం కలిగించాలని సూచించారు. కేసులను మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకుని, ప్రజలు సంతోషంగా జీవించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఏజిపి ప్రబాకర్‌నాయుడు, లోక్‌అదాలత్‌మెంబర్‌ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

మూడు రాజధానులు ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ విద్యార్థుల సంఘీబావం

Tags: Win Lok Adalat nationally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *