యుటిఎఫ్ రాష్ట్ర 16 వ మహాసభలను జయప్రదం చేయండి.
డోన్ ముచ్చట్లు:
యూటీఫ్ 16 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని యూటీఫ్ నాయకులు పిలుపునిచ్చారు,స్థానిక పట్టణంలో యూటీఫ్ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడుతూ
ఈ నెల 12,13,14 తేదీలలో అనంతపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర 16 వ విద్యా వైజ్ఞానిక మహాసభలు జరుగుతున్నాయని కావున డోన్ డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై వాటిని జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్ ఎస్ బాబు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెంకట సుబ్బారెడ్డి,జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి,డోన్ మండల అధ్యక్షులు రామ మూర్తి,ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రెడ్డి,ప్యాపిలి మండల అధ్యక్షులు సర్వజ్ఞ మూర్తి,యుటిఎఫ్ జిల్లా సీనియర్ నాయకులు లక్మయ్య, మాణిక్యం శెట్టి,అబ్దుల్ లతీఫ్ పిలుపునిచ్చారు,స్థానిక యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నందు ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యారంగంలో ఊహించని పెనుమార్పులు వస్తున్నాయని,వాటిని నిశితంగా చర్చించి భవిష్యత్ విద్యారంగానికి దిశానిర్దేశం చేసేవిధంగా మహాసభలో చర్చిస్తామని,ఈ సమావేశాలకు గౌరవ పి డి ఎఫ్ ఎం ఎల్ సీ లు,మాజీ ఎమ్మెల్సీ లు,జాతీయ విద్యా వేత్తలు హాజరు కానున్నారని తెలిపారు, విద్యాశాఖ అధికారులు కూడా విద్యారంగంలో అనేక ప్రయోగాలు చేస్తున్నారని 3,4,5 తరగతుల విలీనం అందులో భాగమేనని వారు అన్నారు, అయితే చిన్నపిల్లలు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవడం చాలా కష్టమని వారు పేర్కొన్నారు,విద్యాశాఖలో 20 వేలు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేసి విద్యారంగాన్ని పరిపుష్టం చేయాలని వారు కోరారు,ఉపాధ్యాయుల,ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నిరంకుశంగా పీఆర్సీ ని అమలు చేశారని,అధికారుల,పాలకుల నియంతృత్వ విధానాలకు ఇది పరాకాష్ట అని వారు అన్నారు,గతంలో సిపిఎస్ రద్దు చేస్తామని పాలకులు అన్నారని, దాని కొరకు ప్రస్తుతం ఆందోళనలు తీవ్రతరం చేసిన నేపథ్యంలో మార్చి 31లోగా రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని అన్నారని, అందుకు అనుగుణంగా స్పందించకపోతే సిపిఎస్ రద్దు కొరకు భవిష్యత్తులో పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు,సమావేశం అనంతరం యుటిఎఫ్ రాష్ట్ర మహాసభల ఆహ్వానం పత్రికలు విడుదల చేశారు,ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు,అంజనప్ప,చంద్ర మోహన్,రమేష్,ఖలీల్,భాస్కర్ రెడ్డి,సుబ్బ రాయుడు,వెంకటేశ్వర్లు,నరసింహారావు,జయ రాముడు,హమీద్,లక్ష్మి దేవి,షంషాద్ బేగం తదితరులు పాల్గొన్నారు.
Tags:Win the 16th UTF State Mahasabha