జిల్లా సమగ్రాభిృద్ధికి పోరాటాలకు వేదిక కానున్న సీపీఐ 24వజిల్లా మహాసభలను జయప్రదం చేయండి

-చలో పొద్దుటూరు కార్యక్రమం గొడపత్రాలను విడుదల చేసిన సీపీఐ నాయకులు

బద్వేలు ముచ్చట్లు:

కడప జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు భవిష్యత్ ఉద్యమాల రూపకల్పనలో భాగంగా జరుగుతున్న సిపిఐ కడప జిల్లా 24వ మహాసభలను జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఏరియా సహాయ కార్యదర్శి చంద్రమోహన్ రాజు బి.కోడూరు మండల కార్యదర్శి యర్రబల్లే ప్రసాద రావు పిలుపునిచ్చారు. గురువారం  సిపిఐ బి.కోడూరు మండల సమితి ఆధ్వర్యంలో బి.కోడూరు సెంటర్ లో  సిపిఐ జిల్లా మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లాలో పెద్దన్నలాంటి సిపిఐ 24వ జిల్లా ఈనెల 20,21 తేదీలలో మహాసభలు అతి వైభవంగా,   భారీ ప్రదర్శనలతో పొద్దుటూరులో  జరగనున్నాయని,ఈ మహాసభలలో జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబానికి మూడు ఎకరాలు సాగు భూమి ,ఇళ్ల స్థలాలు ,ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం  తదితర సమస్యల పరిష్కారం కోసం చర్చ జరిపి రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు  ముమ్మరం చేస్తామని వారు అన్నారు. కావున 20వ తేదీన జరుగబోయే మహా ప్రజా ప్రదర్శనకు మండలంలోని ప్రజలంతా ఊరుకో బండి, ఇంటికోమనిషిగా కదలివచ్చి మహాసభలను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు చెన్నయ్య మండల నాయకులు భాస్కర్,ఓబులేసు,రామయ్య, దేవానందం, రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Win the CPI 24 District Mahasabhas which will be a platform for struggles for the comprehensive development of the district.

Leave A Reply

Your email address will not be published.