26న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

Date:22/11/2020

పుంగనూరు ముచ్చట్లు:

దేశ వ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఈనెల 26న జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరు పాల్గొని , విజయవంతం చేయాలని ఐఎఫ్‌టియు రాష్ట్ర అంగన్‌వాడీ వర్కర్స్ కార్యదర్శి విఆర్‌.జ్యోతి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్‌ భవన్‌లో సార్వత్రిక సమ్మె విజయవంతం కోరుతూ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు ఆసాంఘటిత రంగంలో పనిచేస్తున్నారని, వారిని అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ముఖ్యంగా అంగన్‌వాడీ, వంట కార్మికులు తదితర పరిశ్రమలలో పనిచేస్తున్న వారికి భద్రత కరువైందన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకే దేశ వ్యాప్త ఉధ్యమం ప్రారంభమైందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేకపోతే ఆందోళనలతో హక్కులు సాధించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు నాయకులు యోగేష్‌బాబు, ఈవి.రమణమ్మ, జి.లక్ష్మీ, ఎన్‌.లక్ష్మీదేవి, జి.శాంతకుమారి, హైదర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

Tags; Win the general strike on the 26th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *