ముందు ఎమ్మెల్యేలుగా గెలుద్దాం..

ఎంపీల మనసులో మాట
Date:11/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
ఓప‌క్క సీట్ల స‌ర్దుబాట్ల‌పై కాంగ్రెస్ లో తీవ్ర చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతుంటే… గాంధీ భ‌వ‌న్ కి ఆశావ‌హుల తాకిడితోపాటు, ఫిర్యాదుల వెల్లువ ఎక్కువైంద‌ని తెలుస్తోంది..! త‌మ‌కే టిక్కెట్లు కావాలంటూ ప్ర‌య‌త్నాలు చేసేవారు కొంద‌రైతే… తాము పోటీకి దిగుదాం అనుకుంటున్న స్థానాల్లోకి ఎంపీ అభ్య‌ర్థులు వ‌చ్చి పోటీ చేస్తా అంటూ కొత్త ఫిర్యాదులు కూడా గాంధీభ‌వ‌న్ కు చేరుతున్న‌ట్టు తెలుస్తోంది..!తెలంగాణ‌లో గ‌డువు ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రిగితే అసెంబ్లీతోపాటు లోక్ స‌భ‌కు కూడా ఎన్నిక‌లు వ‌చ్చేవి. కానీ, అసెంబ్లీని కేసీఆర్ ర‌ద్దు చేసేయ‌డంతో కొన్ని నెల‌లు ముందుగానే ఎన్నిక‌లు త‌ప్ప‌లేదు.
రాష్ట్రంలో ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో లోక్ స‌భ అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగాల‌నుకున్న కొంత‌మంది.. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీకి దిగేందుకు సిద్ధ‌మౌతూ ఉండ‌టం విశేషం..! బ‌ల‌రామ్ నాయ‌క్ ఇదే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. సీనియ‌ర్ నేత మ‌ధు యాష్కీ కూడా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి, అసెంబ్లీకి వెళ్లాల‌నే అనుకుంటున్నారు! పొన్నం ప్ర‌భాక‌ర్ కూడా ఎమ్మెల్యేగా గెల‌వాల‌నే ఉద్దేశంతోనే ఉన్న‌ట్టు స‌మాచారం. వీరితోపాటు, 2019లో కాంగ్రెస్ త‌ర‌ఫున‌ ఎంపీలుగా పోటీకి దిగుదామ‌నుకున్న మ‌రికొంద‌రు ఆశావ‌హులు కూడా ఎమ్మెల్యే టిక్కెట్ల రేసులో ఉన్న‌ట్టు తెలుస్తోంది!
Tags:Win the MLAs before

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *