పుంగనూరులో జాతీయ లోక్‌అదాలత్‌ను జయప్రదం చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

జాతీయ లోక్‌అదాలత్‌ను జూన్‌ 26న నిర్వహిస్తున్నామని , అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించి, జయప్రదం చేయాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్తీక్‌ పిలుపునిచ్చారు. మంగళవారం అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సిందుతో కలసి ఆయన కోర్టు ఆవరణంలో న్యాయవాదులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్‌అదాలత్‌లో రాజీకి అనువైన కేసులను పరిష్కరిస్తామన్నారు. ప్రజలు సమస్యలను జఠిలం చేసుకోకుండ శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాలన్నారు. గ్రామ పెద్దలు మధ్యవర్తిత్వం నిర్వహించి, కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Win the National Lok Adalat in Punganur

Post Midle
Natyam ad