– న్యాయమూర్తి కరుణకుమార్
Date:23/11/2020
పుంగనూరు ముచ్చట్లు:
జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 12న జరగనున్న జాతీయ లోక్‌అదాలత్ జిల్లాలోని అన్ని కోర్టుల్లోను జయప్రదం చేయాలని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ న్యాయమూర్తి కరుణకుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన పుంగనూరు సీనియర్ సివిల్‌జడ్జి బాబునాయక్‌తో కలసి న్యాయవాదులు, పోలీసులు, రెవెన్యూ, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కరుణకుమార్ మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమైయ్యే కేసులపై అపీల్ ఉండదని , ఈ విషయాలను కక్షిదారులకు తెలియజేసి, సాధ్యమైనన్ని కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పులిరామక-ష్ణారెడ్డి, కెవి.ఆనంద్‌కుమార్, సీఐ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags; Win the National Lok Adalat on the 12th