వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి
ఓటర్లను కోరిన ఆడ చైర్మన్ సింగ సాని గురు మోహన్
బద్వేలు ముచ్చట్లు:

వైయస్సార్సీపి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వెన్నపూస రవీంద్రారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డిల కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారికి మద్దతు ఇవ్వాలని ఆడా చైర్మన్ సింగ సాని గురు మోహన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా పట్టబద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లుగానే భావించాలని తెలిపారు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు అమలవుతున్న పథకాలు ప్రవేశ పెట్టలేదని అన్నారు ఈనెల 13వ తేదీ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు రెఫరాండంగా భావించి ఎమ్మెల్సీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థానిక ఓటర్లను రప్పించి వారిచేత ఓట్లు వేయించాలని కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాక నాడు నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని గురు మోహన్ అన్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన ఇరువురు అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు శాసనమండలిలో ప్రశ్నించే వారికి ఓట్లు వెయ్యాలని ఆయన కోరారు వైకాపా ఇరువురు అభ్యర్థులకు ఆ అర్హత ఉందని ఆయన తెలిపారు పార్టీ విజయానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు ప్రతి ఇంటికి వెళ్లి పట్ట బద్రులు ఉపాధ్యాయులు కలిసి ఓట్లు అడగాలని ఆయన కోరారు 100% ఓటర్లు ఓటింగ్లో పాల్గొనేలా చూడాలని అన్నారు, పోలైన ఓట్లలో 85% వైకాపా అభ్యర్థులకు ఓటు పడేలా చూడాలని గురు మోహన్ విజ్ఞప్తి చేశారు
Tags;Win the Vaikapa MLC candidates with a huge majority
