విక్రమ్ రెడ్డిని గెలిపించి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించండి

బుధవాడ మాజీ సర్పంచ్ ముట్టుకుందు లక్ష్మి రెడ్డి, ఎంపిటీసీ చప్పిడి రవణమ్మ

ఆత్మకూరు ముచ్చట్లు:

ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని  మర్రిపాడు మండల పరిధిలోని అన్ని  పల్లెల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కృష్ణాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ ముట్టుకుందు లక్ష్మి రెడ్డి సోదరుడు ముట్టుకుందు సిద్ధారెడ్డి మరియు ఎంపిటీసీ చప్పిడి రవణమ్మ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి వైయస్సార్ సిపి పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతొ గెలిపించాలని గడపగడపకు వెళ్లి కరపత్రాలను పంచిపెడుతూ భారీగా ర్యాలీ తొ కరపత్రాలని పంచుకుంటూ ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి తోనే సాధ్యం అవుతుందని దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన ఆశయ సాధనకు అనుకూలంగా ఆచరింపచేసే విధంగా అడుగులు వేస్తారని లక్ష ఓట్ల మెజారిటీతో ఈ ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి ని గెలిపించి ఆశీర్వదించ వలసిందిగా ప్రజలను కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముట్టుకుందు లక్ష్మిరెడ్డి,బుధవాడ ఎంపిటీసీ చప్పిడి రవణమ్మ, వైసీపీ నాయకులు ముట్టుకుందు సిద్ధారెడ్డి, మూల అభిరామిరెడ్డి, ముట్టుకుందు నరసింహారెడ్డి, మూల కొండారెడ్డి, డబ్బుగుడ్డు రవణయ్య, ఆముదల శివ రెడ్డి, ముట్టుకుందు రవి రెడ్డి, నరేష్ కూమార్,బఎస్కె ఖాదర్, ఎస్కె మస్తాన్ వలి, ఎస్కె మాభాష,డి. మనోహర్, పిరుసాబు, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Win Vikram Reddy and contribute to the development of the constituency

Post Midle
Natyam ad