Natyam ad

వైఎస్సార్‌సీపీని గెలిపించండి

పుంగనూరుముచ్చట్లు:

ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని రెండవసారి గెలిపించాలని పలువురు ప్రచారాలు చేపట్టారు. గురువారం మండలంలోని చదళ్లలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, స్థానిక నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అలాగే పట్టణంలో పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్లు శివ, శరణ్‌, వరదారెడ్డి, పిఎల్‌.శ్రీధర్‌, రామకృష్ణ లు ప్రచారం చేశారు. తిరుపతి రోడ్డులో పట్టణ పార్టీ కన్వనర్‌ జయరాం, ముస్లింయూత్‌ నాయకులు , కౌన్సిలర్‌ కిజర్‌ఖాన్‌, అస్లాంమురాధి, మమ్ము, అఫ్రిద్‌, మాలిక్‌, నయాజ్‌, ఆసిఫ్‌, మన్సూర్‌ తదితరులు కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే మేలుపట్లలో సుధాకర్‌రెడ్డి, దొరబాబు ల ఆధ్వర్యంలో యూత్‌ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ విజయంతో గెలిపించాలని , రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేయాలని కోరారు.

Post Midle

 

Tags: Win YSRCP

Post Midle