Natyam ad

వైఎస్సార్‌సీపీని గెలిపించండి

పుంగనూరు ముచ్చట్లు:

ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకోవాలని పలువురు ప్రచారాలు నిర్వహించారు. మండలంలోని బాగేపల్లెలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు ప్రచారాలు చేశారు. అలాగే కుమ్మరనత్తం పంచాయతీలో సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రచారం చేశారు. పట్టణంలోని ఎంబిటి రోడ్డులో పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్లు శివ, శరణ్‌, వరదారెడ్డి, పిఎల్‌.శ్రీధర్‌, రామకృష్ణ లు ప్రచారం చేశారు. అలాగే మేలుపట్లలో కౌన్సిలర్‌ కమలమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకుడు బాలు ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. రహమత్‌ నగర్‌లో కౌన్సిలర్‌ సాజిదాబేగం ప్రచారం చేశారు. అలాగే కౌన్సిలర్లు కిజర్‌ఖాన్‌, పూలత్యాగరాజు, అర్షద్‌అలి, రేష్మా, రాఘవేంద్ర, భారతి, రెడ్డెమ్మ, కాళిదాసు, జెపి.యాదవ్‌, సుప్రియ, పద్మావతమ్మ, నరసింహులు ఆయా వార్డులలో ప్రచారాలు చేశారు. అలాగే దోబీకాలనీలో వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీనివాసులు, హేమంత్‌ కలసి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ విజయంతో గెలిపించాలని , రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేయాలని కోరారు. ఈ ప్రచారాలలో నాయకులు హేమచంద్ర, రామమోహన్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Win YSRCP

Post Midle