పుంగనూరులో 26న వైఎస్సార్‌సీపీ ప్లీనరీని జయప్రదం చేయండి -వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాన్ని ఈనెల 26న పట్టణంలో ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , చైర్మన్‌ అలీమ్‌బాషా, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మంత్రి పీఏ చంద్రహాస్‌తో కలసి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల వారీతో ప్లీనరీ సమావేశం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరౌతారని తెలిపారు. ప్రతి ఒక్కరు ప్లీనరీని జయప్రదం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, లలిత, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అమ్ము, కిజర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags:   YSRCP Plenary on 26th at Punganur – YSRCP Secretary of State Peddireddy

Post Midle
Natyam ad