గెలుపే టార్గెట్

WinTarget

WinTarget

Date:12/10/2018
కరీంనగర్  ముచ్చట్లు:
తెలంగాణలో పై చేయి సాధించడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనదైన స్టైల్లో పావులు కదుపుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో పార్టీ బలాన్ని పరీక్షించుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర నాయకత్వంతో సమావేశం అయిన అమిత్ ఇక క్షేత్ర స్థాయి పర్యటనలతో ఇతర పార్టీల కంటే ముందుండాలని భావిస్తున్నారు. అధికార టీఆర్ఎస్, మహా కూటమి పార్టీల నెగిటివ్ ఓటు బ్యాంకే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 10న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రజాసంక్షేమాన్ని విస్మరించారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ సత్తాను నిరూపించాలని ఆ పార్టీ నేతలంతా పట్టుమీద ఉన్నారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కరీంనగర్ స్థానంతో పాటు ఇరుగు, పొరుగు జిల్లాల్లో కూడా పార్టీ కేడర్ లో నూతన ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా కూడా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.   ఇతర పార్టీల్లో ఉన్న ఉన్న అసమ్మతి వాదులను కూడా బీజేపీలో చేర్పించుకునేందుకు ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ టీఆర్ఎస్, కాంగ్రెస్ లే క్రియాశీలకంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలతో పోల్చితే బీజేపీకి ప్రజాదరణ తక్కువే. అయితే.. అతి త్వరలో ఈ పరిస్థితిని మార్చేసే వ్యూహాలపై కమలనాథులు దృష్టి సారించారు. రాష్ట్రంలో సిసలైన అభివృద్ధి పథంలో నిలవాలంటే తమకే పట్టం కట్టాలని అంటున్నారు. మొత్తంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ లపై పై చేయి సాధించేందుకు బీజేపీ తనదైన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎన్నికల్లో సత్తా చాటేందుకు కృషి చేస్తోంది.
Tags:WinTarget

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *