Natyam ad

రోడ్డుపై వేలాడే వైర్లు తీసివేయాలి  

కడప ముచ్చట్లు:

 

వివిధ రకాల పనులపై రోడ్డు పైకి వచ్చిన వాహనదారులకు రోడ్డుపై  నిర్లక్ష్యంగా, విచ్చలవిడిగా వేలాడదీసిన  కేబుల్స్ వైర్లే, వారికి ఉరితాళ్లుగా మారి అమాయకులను బలి తీసుకుంటున్నాయని, మృతిచెందిన బాధిత నాగయ్య కుటుంబానికి  20 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి,మక్బూల్ భాష, కార్యదర్శి వర్గ సభ్యులు, ప్రసాద్ అన్నారు. శనివారం నగరంలోని ఆర్ సి పి కార్యాలయం లో  విలేకరుల సమావేశం నిర్వహించరు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కడప నగరంలోని ఎర్రముక్కపల్లి హిమాలయ హాస్పటల్ నుండి కలెక్టర్ కార్యాలయము రైల్వే  స్టేషన్ ప్రధాన పీఎఫ్ కార్యాలయం వద్ద రోడ్డుపై నిర్లక్ష్యంగా, ఇబ్బడి ముబ్బడిగా వదిలేసిన కేబుల్స్, వాహనదారుల పాలిట ఉరితాడు గా మారి, అమాయకులైన ప్రజలను బలి తీసుకుంటున్నాయని ,

 

 

కేబుల్స్ తగులుకొని కింద పడి మరణించిన నాగయ్య  కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం కేబుల్స్ యాజమాన్యం ద్వారా ప్రభుత్వం ఇప్పించాలని వారు కోరారు, నగరంలో ఎక్కడ కూడా రోడ్లపై కేబుల్స్ వేలాడకుండా సంబంధిత అధికారులు, కేబుల్ యాజమాన్యాలకు నోటీసులు అందజేసి, యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటిని తొలగించాలని కేబుల్ వైర్లను తనకు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ కరెంటు స్తంభాలను ఇస్తారాజ్యంగా లాగిన యజమానులపై వెంటనే కేసులు బరాయించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నదని వారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర కమిటీ సభ్యులు రవి పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Wires hanging on the road should be removed

Post Midle

Leave A Reply

Your email address will not be published.