పెరిగిన ఎరువులతో… రైతులకు మరింత భారం

గుంటూరుముచ్చట్లు:

గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 86 వేల టన్నుల ఎరువుల నిల్వలున్నాయి. ఈ ఏడాది ఎరువులకు ఏ మాత్రం కొరత ఉండదని అధికార యంత్రాంగం చెబుతుంది.  మూడేళ్లుగా నాగార్జునసాగర్‌ కుడికాల్వ పరిధిలో పూర్తిస్థాయిలో సాగునీరు లేకపోవడంతో ఎరువుల వినియోగం తగ్గింది. గత ఏడాది 20-20 రకం ఎరువులు రూ.897 కాగా ప్రస్తుతం రూ.926  చేరింది. 14-35 రకం ఎరువు గరిష్ఠ ధర రూ.1235 కాగా,ఈ ఏడాది రూ.1275 చేరింది. 28-28 ధర పెరిగింది. డీఏపీ గత ఏడాది రూ.1159 కాగా ప్రస్తుతం రూ.1250 చేరింది. యూరియా గతంలో 50 కిలోల బస్తా ఉండేది. ప్రస్తుతం 45 కిలోలు చేసి ధర తగ్గించినట్లు చెబుతున్నారు. ఇంకా ఎరువుల ధరలు పెరగవచ్చని వ్యాపారులు కూడా చెబుతున్నారు.సాగర్‌ జలాశయం నుంచి పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా జరిగితే జిల్లాలో భారీ స్థాయిలో వరి సాగయ్యేది. సాగుకు నీరు అందుబాటులో లేకపోవడంతో ఎరువుల వినియోగం తగ్గింది.

 

కేవలం పత్తి, మిర్చి రైతులు మాత్రమే వారి అవసరాల మేరకు వినియోగించుకున్నారు. మిగతా పంటలకు ఎరువులు అంతగా అవసరం లేకుండా పోయింది. కాకుంటే వాగుల కింద, చెరువుల కింద వరి సాగు చేసిన వారు ఎరువులు వినియోగించారు. బెట్ట మీద పంట కావడంతో దిగుబడులు కూడా బాగానే వచ్చాయి. ధర విషయం ఇక చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది మిర్చి సాగు పెరుగుతుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తికి గులాబిరంగు పురుగు ఆశిస్తుండటంతో రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే  మిర్చి సాగు పెరగవచ్చని భావిస్తున్నారు. మిర్చి విస్తీర్ణం పెరిగితే ఎరువుల వినియోగం పెరగనుంది. కాబట్టి ధరలు ఇంకా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.జిల్లాలో ప్రస్తుతం 86 వేల టన్నుల ఎరువులు ఉన్నాయి. ఇంకా ఎరువుల నిల్వలు తెప్పిందామంటే ప్రస్తుతం గోదాములు ఖాళీ లేవు. వ్యవసాయ అధికారుల వద్ద ఎరువులకు సంబంధించిన నెలవారీ ప్రణాళికలు అయితే ఉన్నాయి. వాటి ప్రకారం ఎరువులు తెప్పించాలంటే జిల్లాలో ఉన్న గోదాముల్లో మొక్కజొన్న, కందులు, శనగలు ఇలాంటి నిల్వలు అన్ని ఉన్నాయని తెలిసింది. మార్క్‌ఫెడ్‌ అధికారులు గోదాములు ఖాళీ లేవని వ్యవసాయాధికారులకు చెబుతున్నారు. ఖరీఫ్‌కు ఇబ్బంది లేకుండా ఎరువులు అందిస్తామన్నారు. ధరల విషయమై చర్యలు తీసుకుంటామన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:With increased fertilizer … more burden on farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *