Natyam ad

పుంగనూరుకు జర్మన్‌ బస్సుల కంపెనీ రాకతో దేశస్థాయిలో గుర్తింపు-మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌ల కృషి

– పట్టణాలకు  ధీటుగా పుంగనూరు అభివృద్ధి

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పుంగనూరులో జర్మనీ ఎలక్ట్రికల్‌ బస్సుల కంపెనీ ఏర్పాటుకు ముందుకు రావడంతో దేశ స్థాయిలో పుంగనూరుకు గుర్తింపు లభించిందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల కార్యాలయంలో బోయకొండ చైర్మన్‌ నాగరాజారెడ్డి, సచివాలయాల మండల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డితో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పుంగనూరు పారిశ్రామిక పరుగులు తీస్తోందన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ, లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు ప్రత్యేక శ్రద్దతో పుంగనూరు మండలంలో రెండువేల ఎకరాలను ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు కేటాయించారన్నారు. ఎంపీ మిధున్‌రెడ్డి పరిశ్రమలు ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి, రూ. 5 వేల కోట్లరూపాయలతో 800 ఎకరాలలో జర్మన్‌ పెప్పర్‌ ఎలక్ట్రికల్‌ బస్సుల కంపెనీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నిల్‌ ఇవ్వడం అభినందనీయమన్నారు. మండల ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. పుంగనూరు మండలంలో పట్టణాలకు ధీటుగా బస్సుల కంపెనీ రావడం చరిత్ర సృష్టించడమేనన్నారు. బెంగళూరు, గుజరాత్‌, యూపీలో ఉన్న ఫ్యాక్టరీలు పుంగనూరుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని కొనియాడారు. బస్సుల కంపెనీలో 10 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నదని తెలిపారు. బోయకొండ చైర్మన్‌ నాగరాజారెడ్డి మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రె డ్డిలు కలసి బస్సుల కంపెనీ ఏర్పాటుకు అనుమతులు ఇప్పించడంతో పుంగనూరు ముఖచిత్రం మారిపోతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పుంగనూరు కీర్తి పెరిగిందన్నారు. అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి , మంత్రి కుటుంభానికి రుణపడి ఉంటామని తెలిపారు.

 

Tags: With the arrival of the German bus company in Punganur, recognition at the national level – the efforts of Minister Peddireddy and MP Midhun

Post Midle