Natyam ad

సీఎం జగన్‌ ఆశీస్సులతోనే పడమటకు సాగునీరు-తాగునీరు – రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

-ప్రాజెక్టులతో బాబు గల్లంతు
-బాబుకుట్రలు చేసినా విజయం మాదే
– సుప్రీంకోర్టులో విజయం సాధిస్తాం
-ప్రాజెక్టులు నిర్మిస్తాం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

కరువుకాటకాలతో 30 సంవత్సరాలుగా పడమటి నియోజకవర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను పాదయాత్రలో గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట మేరకు మూడు ప్రాజెక్టులు మంజూరు చేశారని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్‌ షన్‌మోహన్‌ , చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, టీటీడీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్‌ కలసి మండల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ భాస్కర్‌రెడ్డి మంత్రిపెద్దిరెడ్డిని, జిల్లా కలెక్టర్‌ను , చిత్తూరు ఎంపీని సన్మానించి , మెమెంటోలు అందజేశారు. అక్కడ జరిగిన సభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ తంబళ్లపల్లె, నేతిగుట్లపల్లె, ఆవులపల్లెలో మూడు ప్రాజెక్టులను నిర్మించడం జరుగుతోందన్నారు. ఈ ప్రాజెక్టులతో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుందని చంద్రబాబు కుయుక్తులతో తప్పుడు కేసులు వేసి స్టేలు తేచ్చి పనులు ఆపారని తెలిపారు. పడమటి నియోజకవర్గాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. అలాగే కడప జిల్లా గండికోట రిజర్వాయర్‌ నుంచి పైపులైన్ల ద్వారా పడమటి నియోజకవర్గాలకు నీరు సరఫరా చేసే కార్యక్రమం పనులు వేగ వంతంగా జరుగుతోందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. ప్రాజెక్టులతో సుమారు 6.50 టిఎంసీల నీటిని నిల్వ చేసి ఈ ప్రాంతాన్ని సశశ్యామలం చేసే కార్యక్రమాన్ని ఎవరు అడ్డుకున్నా ఆగేది లేదని , ప్రాజెక్టులు నిర్మించి తీరుతామన్నారు. సుప్రీంకోర్టుకు పూర్తి వివరాలు సమర్పించి విజయం సాధిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని , రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలను గుర్తించి ఆయనకు అండగా నిలవాలని , తిరిగి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మార్కెట్‌ కమిటి చైర్మన్‌ అమరనాథరెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లె రెడ్డెప్ప, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ కొత్తపల్లె చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags; With the blessings of CM Jagan, Irrigation and drinking water will be provided to the West – State Minister Peddireddy Ramachandra Reddy

Post Midle