With the collective effort, Corona Mohammedi should be chased away

సమిష్టి కృషితో కరోనా మహమ్మరిని తరిమికొట్టాలి

– పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్
-రూ.10 లక్షలు విరాళం

Date:26/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజలందరి సమిష్టి కృషితో కరోనా మహమ్మరిని తరిమికొట్టలని  పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎల్ఐసి కాలనీలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మరి బారి నుండి బయట పడడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ కార్యక్రమానికి పునుకున్నారన్నారు. ఇందులో భాగంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందికి ప్రజలు ఎప్పుడూ రుణ పడి ఉండాలన్నారు. తన వంతు సాయంగా మున్సిపల్ కార్మికులకు రూ.2లక్షలు, వైద్య సిబ్బందికి రూ.2లక్షలు, నియోజకవర్గంలోని 6 పోలీస్ స్టేషన్లకు రూ.6లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 6వేలు మాస్కులు, 100 శానిటేజర్లు పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చనకంటి సాంబమూర్తి, నగేష్, మంజునాథ్, రాజశేఖర్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు

ఆక్రమణే అంతా 

Tags: With the collective effort, Corona Mohammedi should be chased away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *