With the development of the state development

రాష్ట్రభివృద్ధి జగన్‌తోనే సాధ్యం

Date:07/04/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ప్రచారంలో పలువురు వెల్లడించారు. ఆదివారం పుంగనూరులో వైస్సార్‌సీపీ ప్రచారాల జోరు ఊపందుకుంది. పార్టీ అభిమానులు విడివిడిగా వార్డులలో ప్రచారాలు ముమ్మరం చేశారు. పట్టణ సమీపంలోని నక్కబండలో మహిళా నాయకురాలు రషీదతో కలసి డాక్టర్లు శివ,ప్రబాకర్‌, శరణ్‌, ప్రవీన్‌, మాజీ కౌన్సిలర్‌ బిటి అతావుల్లా, పెన్షనర్లు చెంగారెడ్డి, రామక్రిష్ణారెడ్డి, రఘుపతి, విశ్రాంత మిలటరీ ఉద్యోగులు క్రిష్ణప్ప, సుబ్రమణ్యం, నాగరాజారెడ్డి ప్రచారం చేశారు. అలాగే చింతలవీధి, కట్టక్రిందపాళ్యెం ప్రాంతాలలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్‌ దివ్యలక్ష్మి, మహిళా నాయకురాలు రెడ్డెమ్మ ప్రచారాలు చేశారు. మేలుపట్లలో రోటరీక్లబ్‌ కార్యదర్శి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. బజారువీధి, సుబేదారువీధిలో ఆర్యవైశ్య సంఘ నాయకులు ముల్లంగి విజయకుమార్‌, బాలసుబ్రమణ్యం, శ్రీధర్‌ , వెంకటేష్‌ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. అలాగే ఎన్‌ఎస్‌.పేటలో కౌన్సిలర్లు రేష్మా, మంజుల ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఉబేదుల్లాకాంపౌండు, పోలీస్‌లైన్‌లో మున్సిపల్‌ ఉద్యోగ కార్మికసంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌ ప్రచారాలు చేశారు. తాటిమాకులపాళ్యెం, కోనేటిపాళ్యెంలో ముస్లిం మహిళలు రహత్‌జాన్‌, రాఫియాసుల్తాన ప్రచారం చేశారు. అలాగే కౌన్సిలర్లు ఇనాయతుల్లాషరీఫ్‌, ఆసిఫ్‌, మైనార్టీ నాయకులు ఇంతియాజ్‌ఖాన్‌, కిజర్‌ఖాన్‌, అంజాద్‌, ఖాజా, ఇర్ఫాన్‌లు ప్రచారం చేశారు. హైస్కూల్‌వీధి, ఏవిరావువీధిలో కౌన్సిలర్‌ త్యాగరాజు ప్రచారాలు నిర్వహించారు. కొత్తయిండ్లలో కౌన్సిలర్‌ మనోహర్‌, పార్టీ నాయకులు అజ్ముతుల్లా, గురుప్రసాద్‌, హరిప్రసాద్‌, దొంతి వెంకటేష్‌, రాజారెడ్డి, కిట్టా ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈస్ట్పేట, తూర్పువెహోగశాలలో కౌన్సిలర్‌ రెడ్డిశేఖర్‌, వైఎస్సార్‌సీపీ కార్యదర్శి ప్రభు, మాలమహానాడు అధ్యక్షుడు అశోక్‌, గణేష్‌ ఆధ్వర్యంలో ప్రచారాలు నిర్వహించారు. మండలంలోని నక్కబండలో కో-ఆప్షన్‌మెంబరు ఖాదర్‌బాషా తన అనుచరులతో ప్రచారం చేశారు. అలాగే పార్టీ యువజన సంఘ నాయకుడు రాఘవేంద్రరెడ్డి, యశ్వంత్‌కుమార్‌, షకీల ఇంటింటా ప్రచారం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శివ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరు సైనికులవలె పనిచేయాలని కోరారు. ఎన్నికలలో ప్రజలందరు రెండు ఓట్లు ఫ్యాన్‌గుర్తుకే వేయాలని సూచించారు.

 

పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డిని గెలిపించాలని స్వర్ణలత, శ్రీశక్తి ప్రచారం

 

Tags: With the development of the state development

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *