మంత్రి శ్రావణ్‌తో రాజీనామా చేయించండి 

Date:08/05/2019
అమరావతి  ముచ్చట్లు:
రాష్ట్ర వైద్య, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చట్టసభల్లో సభ్యుడు కాని ఆయన గతేడాది నవంబరు 11న చంద్రబాబు కేబినెట్‌లో
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం.. మంత్రిగా నియమితులైన వారు ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాలి. శ్రావణ్‌కు ఆరునెలల వ్యవధి ఈ నెల 10తో
ముగుస్తుంది. 11 నుంచి ఆయన మంత్రిగా కొనసాగడానికి వీల్లేదు. ఆయన తండ్రి, అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడంతో శ్రావణ్‌కు మంత్రిగా అవకాశం
లభించిన విషయం తెలిసిందే.రాష్ట్ర శాసనసభకు గత నెల 11నే పోలింగ్‌ జరిగినా.. ఫలితాలు ఈ నెల 23న వెలువడతాయి. ఈ ఎన్నికల్లో ఆయన గెలిచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి
మరికొన్ని రోజులు పడుతుంది. పదో తేదీతోనే ఆరునెలల గడువు ముగుస్తుండడంతో రాజ్‌భవన్‌ అప్రమత్తమైంది. ఒక మంత్రి చట్ట సభల సభ్యుడు కాలేక ఆటోమేటిగ్గా పదవి కోల్పోవడం
అవమానకరంగా ఉంటుందని.. అందువల్ల పదో తేదీలోపే శ్రావణ్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించాలని గవర్నర్‌ నరసింహన్‌ సీఎంకు సూచించినట్లు తెలిసింది.
Tags:With the end of 10, resign with Minister Shravan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *