Natyam ad

జగన్‌ ప్రేమతో… ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా తాగునీరు-రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

-రూ.2800 కోట్లతో గండికోట నుంచి పైపులైను
– ఓవర్‌హెడ్‌ట్యాంకుల నిర్మాణం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని ప్రజలపై ఎంతో ప్రేమతో ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా తాగునీరు అందించే పనులు మంజూరు చేశారని, పనులు వేగవంతంగా జరుగుతోందని రాష్ట్ర విద్యుత్‌, అటవి, పర్యావరణ , గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని సచివాలయాలు, ఆర్‌బికెలు, వైఎస్సార్‌హెల్త్ క్లీనిక్‌లు, ఆర్‌వోఆర్‌ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మంత్రి పెద్దిరెడ్డి, జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు, ఎంపీ రెడ్డెప్ప పాల్గొని ప్రారంభించారు. సింగిరిగుంట గ్రామంలో జరిగిన సభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కడప జిల్లా గండికోట రిజర్వాయర్‌ నుంచి రూ.2800 కోట్ల రూపాయలతో పైపులైన్ల ద్వారా పుంగనూరుకు నీరు అందిస్తామన్నారు. ప్రతి ఇంటికి సాగునీరు-తాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. అలాగే రూ.1500 కోట్లతో మూడు రిజర్వాయర్లను సీఎం మంజూరు చేశారని తెలిపారు. నేతిగుట్లపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్ల ద్వారా పడమటి నియోజకవర్గాలలో కరువును పారద్రోలే కార్యక్రమం చేపట్టామన్నారు. చంద్రబాబు అండ్‌కో నీచబుద్దితో రిజర్వాయర్లపై స్టేలు తెచ్చి పనులు ఆపివేశారని తెలిపారు. సుప్రీంకోర్టులో తీర్పు రాగానే ఎన్నికలలోపు రిజర్వాయర్లు పూర్తి చేసి , ప్రజలకు అంకితం చేస్తామన్నారు. నియోజకవర్గంలో రైతులు పడుతున్న అవస్థలు గుర్తించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారన్నారు. వలంటీర్ల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందించడం జరుగుతోందన్నారు. ఆర్‌బికెలలో విత్తనాలు, ఎరువులు సబ్సిడి ధరలకు ఇవ్వడం జరుగుతోందన్నారు. గతంలో రైతులు క్యూలో నిలబడి సొమ్మసిల్లిపోయారన్నారు. అలాంటివి లేకుండ రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు ,సూచనలను ఎప్పటికప్పుడు ఇంటి వద్దనే అందిస్తున్న ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేదరికమే అర్హతగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిదేనని కొనియాడారు. ప్రతి ఒక్కరు అభివృద్ది పనులను చూసి వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఆంజప్ప, మాజీ ఎంపీపీ నరసింహులు, టీటీడీ బోర్డు మాజీ మెంబరు పోకల అశోక్‌కుమార్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొంవీటి నాగభూషణం, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, నియోజకవర్గ పరిశీలకుడు జింకావెంకటాచలపతి, సచివాలయల కన్వీనర్‌ కొత్తపల్లి చెంగారెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యదర్శులు చంద్రారెడ్డి యాదవ్‌, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవాలు..

మండలంలోని సింగిరిగుంటలో ఆర్‌బికె కేంద్రాన్ని, వైఎస్సార్‌హెల్త్ సెంటర్‌ను, ఆర్‌వోప్లాంటును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అలాగే కురప్పల్లెలో వాటర్‌ప్లాంటు, ఆరడిగుంటలో వైఎస్సార్‌హె ల్త్ సెంటర్‌, కీలకిరిలో వాటర్‌ప్లాంటు, కుమ్మరగుంటలో వాటర్‌ప్లాంటు, బసివినాయునిపల్లి వైఎస్సార్‌ హెల్త్ సెంటర్‌, ఆర్‌బికె, వాటర్‌ప్లాంటు, మాగాండ్లపల్లిలో వాటర్‌ప్లాంటు, మేలుందొడ్డిలో వాటర్‌ప్లాంటు, శాంతినగర్‌లో ఆర్‌బికె, రాంపల్లిలో వాటర్‌ప్లాంటు, ఎంసి.పల్లి, తాండలలో వాటర్‌ప్లాంట్లు, సుగాలిమిట్టలో వైఎస్సార్‌ హెల్త్ సెంటర్‌, పాలెంపల్లిలో హెల్త్సెంటర్‌, ఏఎన్‌.కుంటలో వాటర్‌ప్లాంటు, చదళ్లలో సచివాలయం, ఆర్‌బికె, వాటర్‌ప్లాంటు, ఏతూరులో వాటర్‌ప్లాంటు, నల్లగుట్లపల్లిలో వాటర్‌ప్లాంటు, ఇటుకనెల్లూరులో వైఎస్సార్‌ హెల్త్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. మండలంలో వెహోత్తం 26 ప్రారంభోత్సవాలను నిర్వహించారు.

సున్నావడ్డీ రుణాలు పంపిణీ…

మండలంలోని 23ంచాయతీల్లోని 1325 మహిళా సంఘాలకు రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సున్నావడ్డీ రుణాల క్రింద రూ.1.52 కోట్లు చెక్కు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి సూచించారు.

రైతులకు పరికరాలు పంపిణీ …

డ్వామా ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 2573 మంది రైతులకు రూ.4.83 కోట్లతో మంజూరైన వ్యవసాయ పరికరాలను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ డ్వామా ద్వారా ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడి, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడితో పనిముట్లు అందిస్తున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్‌ గంగాభవాని, ఏపీడీ ఉమావాణి పాల్గొన్నారు.

పూజలు…

పట్టణంలోని తూర్పువెహోగశాలలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ప్రభు ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుడికి మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప, జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా పాల్గొన్నారు.

పరామర్శ…

మున్సిపల్‌ కౌన్సిలర్‌ యువకుమారి కుటుంబ సభ్యులను మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. గత వారం కౌన్సిలర్‌ భర్త శంకర్‌రాజు ఆనారోగ్యంతో మృతి చెందాడు. మంత్రి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి , పరామర్శించారు.

Tags: With the love of Jagan… drinking water through taps for every house – State Minister Dr. Peddireddy Ramachandra Reddy

Post Midle