కర్నాటక ఫలితాలతో బీజేపీకి, మోడికి చావు దెబ్బ

With the results of Karnataka, the BJP and Modi are killed

With the results of Karnataka, the BJP and Modi are killed

-ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్

Date:06/11/2018

సచివాలయం ముచ్చట్లు:

కర్నాటకలో జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్రమోడికి చావు దెబ్బ వంటివని ఏపీ శాసనమండలి ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ అభిప్రాయపడ్డారు. కర్నాటక ఎన్నికల ఫలితాలే త్వరలో జరగబోయే తెలంగాణా సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్సన్ బాబుతో కలిసి ఆయన మాట్లాడారు. కర్నాటకలో ఇటీవల మూడు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయన్నారు. వాటిలో రెండు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్-జేడీఎస్ కూటమి గెలుచుకుందన్నారు. ఇది చారిత్రిక విజయమన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం సాధించాలని సీఎం చంద్రబాబునాయుడు కోరుకున్నారన్నారు. కొద్ది నెలల కిందట జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని అక్కడి తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలుగు ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో బీజేపీ, పీఎం నరేంద్రమోడికి కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు మరోసారి తెలిసొచ్చేలా చేశాయన్నారు.

సీఎం చంద్రబాబునాయుడు వ్యూహా రచనకు బీజేపీ విలవిలలాడిపోతోందన్నారు. 2014 ఎన్నికల్లో అభివృద్ధి అజెండాగా సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి బీజేపీ, ప్రధాని నరేంద్రమోడి ప్రజల ముందుకెళ్లారన్నారు. ఏపీ పునర్విభజన చట్టం, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పీఎం నరేంద్రమోడి ముఖం చాటేయడంతో, ఎన్డీయే నుంచి టీడీపీ బయటకొచ్చిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడి వ్యూహా రచనకు తాళలేక, అభివృద్ధి అజెండా వదలి బీజేపీ నాయకులు మత రాజకీయాలను ముందుకు తీసుకొస్తున్నారని శాసనమండలి విప్ డొక్కా మాణిక్య ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, పవన్ లోకల్ లీడర్లు… టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీరామారావు బాటలో పయనిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు జాతీయ భావాలతో దేశ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారని శాసనమండలి విప్ డొక్కా మాణిక్య ప్రసాద్ కొనియాడారు. ఎన్డీయే, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ లతో జాతీయ రాజకీయాల్లో తెలుగువారి సత్తా సీఎం చంద్రబాబు చాటారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు తెలుగు ప్రజలంతా వెన్నుదన్నుగా నిలువాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్, పవన్ కల్యాణ్ లోకల్ నేతలన్నారు. వారికి జాతీయ దృక్పథం లేదన్నారు.

తెరాస సొంతంగా అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం

Tags:With the results of Karnataka, the BJP and Modi are killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *