బాలిక అనుమానాస్పద మృతితో… రణరంగమైన స్కూలు

తమిళనాట తీవ్ర ఉద్రిక్తత
పోలీసులకు గాయాలు

చెన్నై ముచ్చట్లు:

ప్రైవేటు విద్యా సంస్థలో ఓ బాలిక అనుమానాస్పద మృతి తమిళనాట తీవ్ర ఉద్రిక్తతకు, ఆస్తుల విధ్వంసానికి దారి తీసింది. కాళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలం సమీపంలోని కన్నియమూరు గ్రామంలో ఓ ప్రైవేటు ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో శ్రీమతి (17) అనే బాలిక ప్లస్‌–2 చదువుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్‌ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
రెండు రోజులుగా కుటుంబీకులు, బంధువులు అక్కడే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఆదివారం గుర్తు తెలియని యువకులు వందలాదిగా చొరబడి విధ్వంసానికి దిగారు. దాంతో డీఐజీ పాండియన్‌తో పాటు 20 మంది పోలీసులు గాయపడ్డారు. మంత్రులు, డీజీపీ, హోం శాఖ కార్యదర్శి వచ్చి వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

Tags: With the suspicious death of the girl… the school is fighting

Leave A Reply

Your email address will not be published.