Natyam ad

హైకోర్టు తీర్పుతో… తెదేపా, జనసేన బండారమంతా బయటపడింది

-ప్రజలను మార్గదర్శి చిట్ ఫండ్స్ మోసం చేస్తుంది: మంత్రి అంబటి రాంబాబు

 

తాడేపల్లి ముచ్చట్లు:

 

Post Midle

మార్గదర్శిలో చిట్లు వేసే ఖాతాదారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అంబటి రాంబాబు ప్రజలను హెచ్చరించారు. శుక్రవారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామోజీరావు వైట్ కాలర్ క్రిమినలని దుయ్యబట్టారు. చిట్ ఫండ్స్ డబ్బులు ఇతర సంస్థలకు మళ్లించకూడదు. అక్రమంగా డిపాజిట్లు తీసుకోబోమని కోర్టులకు చెప్పి ఇంకా డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. చిట్ పాడుకున్న వారిని 3-4 నెలలు తిప్పి షూరిటీలను నిరాకరిస్తూ చిట్స్ సొమ్మును సొంత అవసరాలకు వాడుకుంటున్నారని అంబటి వ్యాఖ్యనించారు.రాష్ట్రంలో చిట్ ఫండ్ కంపెనీలపై సోదాలు జరుగుతున్నాయని చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామోజీ సంస్థలన్నీ చట్ట వ్యతిరేకంగా నిర్మితమయ్యాయని, మార్గదర్శి చట్టాన్ని ఉల్లంఘించి అనేక అక్రమాలకు పాల్పడుతోందని జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒక్కొక్కటిగా తేటతెల్లమవుతున్నాయని మంత్రి అన్నారు.సుప్రీంకోర్టులో ప్రస్తుతం మార్గదర్శి కేసు నడుస్తోంది. రామోజీరావు చట్ట వ్యతిరేకంగా మార్గదర్శిని నడుపుతున్నారు. మార్గదర్శి యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తుంది. ష్యూరిటీలు లేని కారణంగా చీట్స్ వేసిన వారికి డబ్బులు ఇవ్వడం లేదని మార్గదర్శి చెబుతుంది. దీనితో పాడుకున్న వారి డబ్బులు మార్గదర్శిలోనే ఉండిపోతున్నాయి. ఆ డబ్బులను వారి ఇతర సంస్థల్లోకి పెట్టుబడులుగా వాడుకుంటుంది. గత 50-60 ఏళ్లుగా రామోజీరావు పైసా పెట్టుబడి లేకుండా వ్యాపారాలను ఈ విధంగానే చేస్తున్నారని అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మొన్న జరిగిన సోదాల్లో. రామోజీరావు సంస్థలు మోసాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. చిట్స్ సొమ్మును ఖాతాలో వేయాలి. ప్రతి చిట్ కు ఒక ప్రత్యేక ఖాతా ఉండాలని చట్టంలోనే ఉంది. మొన్న జరిగిన సోదాల్లో అధికారులు ఆ విషయాన్ని గుర్తించారన్నారు.

 

 

 

కోర్టు తీర్పుతో వెలుగులోకి వచ్చిన నిజాలు
ఇప్పటంలో ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో వారి విషయంలో ప్రభుత్వం నిబంధనలు మేరకు నడుచుకున్నా ఏదో జరిగిపోతోందని రాష్ట్రంలో భ్రమ కల్పించేందుకు పవన్ ప్రయత్నించారు. కోర్టు విచారణలో నిజాలు నిర్భయంగా వెలుగులోకి వచ్చాయని కోర్టునే మభ్యపెట్టి స్టే తెచ్చుకున్నట్టు తేటతెల్లమైందన్నారు. ఈ కేసుకు సంబంధించిన 14 మందికి రూ.లక్ష చొప్పున కోర్టు జరిమానా విధించిందని పవన్ కల్యాణ్ అయితే ప్రభుత్వాన్నే కూల్చిపడేయాలన్నారు. ప్రతిపక్షాలు కోర్టులను మోసం చేసేందుకు కూడా వెనుకాడటం లేదని మంత్రి అంబటి వ్యాఖ్యనించారు.

 

 

 

 

టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది
తన ఫోన్ పోయిందని విజయసాయిరెడ్డి కంప్లైంట్ ఇస్తే ఆ సెల్ లోనే చాలా కుట్రలు కుతంత్రాలు దాగున్నాయని అవన్నీ పోగొట్టడం కోసమే ఈ విధంగా సెల్ పోయిందని చాలా మంది టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టె దీన స్థితిలోకి పోవడం దురదృష్టకరం. టీడీపీ నేతలు రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్నో రకాలుగా విషపూరిత ప్రచారాలు చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చవకబారు రాజకీయ చేస్తున్నారన్నారు.

 

Tags: With the verdict of the High Court, TDP and Jana Sena have all been exposed

Post Midle

Leave A Reply

Your email address will not be published.