తిండి లేక…వ్యభిచారం…
కొలంబో ముచ్చట్లు:
శ్రీలంక దేశం పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. గత నాలుగు నెలలు నుంచి శ్రీలంక ఆర్థిక సంక్షోభం తో కొట్టుమిట్టాడుతోంది. తినడానికి తిండిలేక, చేయడానికి ఉద్యోగం లేక శ్రీలంక ప్రజలు అల్లాడుతున్నారు. కరోనా కాలంలోనే ఈ పరిస్థితి మొదలవ్వగా ప్రస్తుతం ఈ దేశ పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక దేశాధ్యక్షుడు గొటబాయ ప్రజలను గాలికి వదిలేసి రాజపక్ష దేశం వదిలి సింగపూర్ పారిపోయాడు. పట్టించుకొనేవారు లేరు, తిండి పెట్టే దిక్కులేక ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమలో పనిచేసే మహిళలు.. ఎక్కడ తమ ఉద్యోగం పోతుందో, పిల్లలకు తిండి పెట్టలేమని ఆలోచించి వ్యభిచారంలోకి దిగుతున్నారట.. గడిచిన నాలుగు నెలల్లో వ్యభిచార వృత్తిలో దిగినవారి సంఖ్య 30%శాతానికి చేరిందని అంచనా. నిజం చెప్పాలంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఏది ఉండదని అంటున్నారు. కడుపు నింపుకోవడానికి ఒళ్లు అమ్ముకుంటున్నారని, చిన్నారులను రక్షించుకోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదని వారు భావిస్తున్నారట.శ్రీలంక రాజధాని నగరం కొలంబో ప్రాంతంలో ఈ ఏడాది జనవరి నుంచి ‘ఆయుర్వేద స్పా’ల ముసుగులో వ్యభిచార గృహాలు పుట్టుకొచ్చాయని టాక్ నడుస్తోంది.

ఇక బలవంతంగా పడక వృత్తి చేస్తున్నా.. తమకు డబ్బులు బాగానే వస్తున్నాయని, అంతకు ముందు నెలకు వచ్చే జీతం.. ఇప్పుడు రోజుకే వస్తుందని మహిళలు చెప్పుకొస్తున్నారు. గత్యంతరం లేక ఈ పనిలో దిగామని తెలుపుతున్నారు. ఇంట్లో ఆహారం, మందులు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయని, వాటిని కొనలేని స్థితిలో ఉన్నామని, ఈ వ్యభిచారం తమకు తిండి పెడుతుందని, ఇష్టం లేకపోయినా వ్యాపారులకు తమ శరీరాలను అప్పగిస్తున్నట్లు చెప్పుకొస్తున్న వారి కథలు విన్నవారి గుండెలు బద్దలు అవ్వక మానడం లేదు అని అంటున్నారు. మరి ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుంది.. శ్రీలంక ఆర్థిక సంక్షోభం ఎప్పుడు చక్కబడుతోంది అనేది ఆ దేవుడికే తెలియాలి అంటున్నారు ఈ విషాదాన్ని విన్నవారు.
Tags: Without food…fornication…
