Natyam ad

జగన్‌ లేకపోతే సంక్షేమం ఆగిపోతుంది- జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన లేకపోతే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగిపోతుందని జె డ్పి చైర్మన్‌ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. మండలంలోని ఎంసి.పల్లి, సుగాలిమిట్ట, బోడేవారిపల్లి , చండ్రమాకులపల్లె, నల్లగుట్లపల్లెతాండ, రాగానిపల్లె గ్రామాలలో మేము సిద్ధం…మాబూత్‌ సిద్ధం…అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్లను విడుదల చేశారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలకు రెండు ఓట్లు ఫ్యాన్‌గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

 

 

 

Post Midle

ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్‌ మాట్లాడుతూ జగనన్న ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ, వలంటీర్లను కనుమరుగు చేసేందుకు ఉమ్మడి పార్టీ అభ్యర్థులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 2014 లో మాయమాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ సారి కూడ అలాగే ప్రజలను మోసగించేందుకు వస్తున్నారని , వారికి తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి, సచివాలయ కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, నాయకులు జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, బాబు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Tags: Without Jagan, welfare will stop – ZP Chairman Srinivasulu

Post Midle