Natyam ad

జగనన్న లేకపోతే సంక్షేమం ఆగిపోతుంది – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి లేకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతుందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మేము సిద్ధం….మా బూత్‌ సిద్ధం కార్యక్రమాన్ని మండలంలోని కమతంపల్లెలో పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. మే 13 న జరిగే ఎన్నికలలో రెండు ఓట్లు ఫ్యాన్‌గుర్తుపై వేయాలని ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను గెలిపించాలని కోరారు. అలాగే పట్టణంలోని సుబేదారువీధిలో సీమజిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌ షరీఫ్‌, కౌన్సిలర్‌ కిజర్‌ఖాన్‌ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎన్నికల కోసం ఉమ్మడి పార్టీ అభ్యర్థులు మాయమాటలతో ఓటర్లను మోసగించేందుకు తప్పుడు హామీలు ఇస్తారని వాటిని నమ్మవద్దని కోరారు. 30 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధిని ఐదేళ్ల పాలలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి చేసి చూపించారని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరిగిందాలేదా అన్న విషయాలను గమనించాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Without Jagananna, welfare will stop – MPP Bhaskar Reddy

Post Midle