వైఫ్ ఆఫ్ ది ఇయర్ అంటూ సెటైర్లు

Date:20/02/2021

ముంబై ముచ్చట్లు:

రోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ వల్ల చాలామంది ఇళ్ల నుంచే పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీటింగులన్నీ జూమ్ వీడియో కాల్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే, ఈ వీడియో కాల్ మీటింగులు వల్ల కొందరు అనుకోని చిక్కుల్లో పడుతున్నారు. కొంతమంది వీడియో కాల్‌లో వీడియో ఆపకుండానే తమ పార్టనర్ లేదా స్టాఫ్‌తో రొమాన్స్ లేదా ఏవేవో పిచ్చి పనులు చేస్తూ కెమేరాలకు చిక్కుతున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా శ్వేతా అనే యువతి వీడియో కాల్ ట్విట్టర్‌లో ఎలా ట్రెండవ్వుతుందో తెలిసిందే. ఆమె తన మైక్‌ను మ్యూట్ చేయకుండా తన స్నేహితుడి సె* సీక్రెట్లన్నీ బయటకు చెప్పేయడంతో నెట్టింట మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి.ఆ ఘటన ఇంకా ట్రెండింగులో ఉండగానే.. మరో వీడియో వైరల్‌గా మారింది. ఓ జూమ్ మీటింగ్‌లో బిజీగా ఉండగా.. అతడి భార్య ముద్దు ఇవ్వబోయింది. దీంతో అతడికి ఒక్క సెకన్ మైండ్ బ్లాకయ్యింది. భార్య వైపు కోపంగా చూస్తూ.. ఇక్కడ వీడియో కాల్‌లో ఉన్నా కనిపించడం లేదా? కెమేరా ఆన్‌లో ఉందంటూ చిటపటలాడాడు. దీంతో ఆమె చిన్న లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది.పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా ‘జూమ్ కాల్.. సో ఫన్నీ’ అంటూ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేయగానే వైరల్‌గా మారింది. ఈ వీడియోపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర కూడా స్పందించారు. ‘‘ఆ మహిళను నేను వైఫ్ ఆఫ్ ది ఇయర్‌గా నామినేట్ చేస్తాను. భర్త దాన్ని సరదాగా భావించి ఉంటే.. వారిని కపుల్ ఆఫ్ ది ఇయర్‌గా నామినేట్ చేసేవాడిని. అతడు చికాకు పడటం వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది’’ అని కామెంట్ చేశారు. దీంతో నెటిజనులు కూడా ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు భర్త అంటే ఎంత ప్రేమో అని అంటున్నారు.

పుంగనూరులో చట్టాలపై అవగాహన అవసరం – న్యాయమూర్తి బాబునాయక్‌.

Tags: Wives of the Year

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *