కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్య

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లా పెండ్లిమర్రి మండలం కారపు రెడ్డి పల్లె గ్రామానికి చెందిన సరస్వతి అనే మహిళ (32) మైన్స్ గనులలో నీటిలో పడి ఆత్మహత్య చేసుకుంది. గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఇంటినుండి బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా లాభం లేకపోయింది. చివరకు ఆమె క్వారీ గుంతలో పడి ఉన్నట్లు తెలిసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పెండ్లిమర్రి ఎమ్మార్వో , పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని బంధువులు చెబుతున్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Woman commits suicide with family problems

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *