బాయిలర్ ప్రమాదంలో మహిళ మృతి
తాడేపల్లిగూడెం ముచ్చట్లు:
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో ఫుడ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ బాయిలర్ కన్వేయర్ బెల్ట్ లో పడి మహిళ మృతి చెందింది. బుధవారం ఉదయం బాయిలర్ కన్వేయర్ వద్ద వూక వేసే
క్రమంలోదాంట్లో ఆమె పడి మరణించింది. డిసెంబర్ 21వ తేదీన ప్రమాదం జరిగి ఒక వ్యక్తి మరణించాడు. ఆ ఘటన మరువకముందే మరో మహిళ మృతి చెందింది. మృతురాలు పేరు దేవళ్ల వెంకట రమణ(55), తాడేపల్లిగూడెం మండల కృష్ణాయపాలెం గ్రామం. గత పదేళ్లుగా ఫుడ్ ఫాట్స్ లో పనిచేస్తుంది. బొగ్గు, ఊక బాయిలర్ దగ్గర పనిచేస్తుంది.పెంటపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:Woman dies in boiler accident

