Natyam ad

పుంగనూరులో మహిళ మృతి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని వెంకటాద్రికాలనీకి చెందిన శ్రీనివాసులు భార్య టి.కాంతమ్మ(40) శుక్రవారం సాయంత్రం మంగళం చెరువులో శవమై తేలింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ సమీపంలోని వెంకటాద్రికాలనీకి చెందిన కాంతమ్మ గత రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. గత రెండు రోజులుగా కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఇలా ఉండగా ఆమె శవమై చెరువులో తేలడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు . ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, కాంతమ్మ మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: Woman dies in Punganur

Post Midle