కరోనాతో మహిళ మృతి

సదుం ముచ్చట్లు :

 

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం గ్రామ పంచాయతీ పరిధిలో ఒక మహిళ కొవిడ్ తో పోరాడుతూ మృతి చెందింది. బట్టువారిపల్లెకు చెందిన ఎస్ .మస్తాన్ భార్య తాఙూన్( 35) కొవిడ్ తో బాధపడుతూ తిరుపతిలోని రుయాలో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ వర్గాలు తెలిపారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లితో రోజు తాను మాట్లాడే వాడినని, మూడు రోజులుగా అమ్మను కలవడానికి గాని కనీసం మాట్లాడడానికి కూడా ఆసుపత్రి వర్గాలు నిరాకరించారని, దీంతో ఆమె మూడు రోజుల క్రితమే మృతి చెందిందని భావిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి చివరకు గుండెపోటుతో మృతి చెందిందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags; Woman dies with corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *