పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని తూర్పు మొగశాలలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. మండలంలోని లక్ష్మీపురం కాలనీలో నివాసం ఉన్న శ్రీదేవి (35) మహిళ తన పనుల నిమిత్తం పుంగనూరుకు వచ్చింది. తూర్పు మొగశాల వద్ద నడుచుకుని వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈమెను గమనించి స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Tags: Woman injured in Punganur road accident