Date:17/01/2021
అనంతపురం ముచ్చట్లు:
గుంతకల్లు పట్టణ శివారులోని బళ్ళారి రోడ్డు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.కొనగండ్ల సమీపంలో 18 మంది కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ఘటనలో వజ్రకరూరు మండలం, కొనకొండ్ల గ్రామానికి చెందిన రమణమ్మ (35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 17 మంది గాయపడ్డారు.వారిలో నలుగురు బావమ్మ, లక్ష్మిదేవి, నాగవేణి, సుమ తీవ్రంగా గాయపడ్డారు.వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పుంగనూరులో ఎస్టీయు 74వ వార్షికోత్సవ వేడుకలు
Tags:Woman killed as car overturns